తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రులకు పాస్‌పోర్టు కావాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రకటించడంతోనే తెలంగాణ ద్రోహిగా పరిగణిస్తున్నామని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.
వైఎస్‌కు మొదటి అభిమాని తానేనని, తెలంగాణ ఏర్పడితే పాస్‌పోర్టు అడుగుతారని ప్రకటించినప్పటి నుంచి వైఎస్‌ను ద్రోహిగా భావించామన్నారు. త్యాగధనుల సభలో వైఎస్ చిత్రపటం పెట్టొద్దని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా సమష్టిగా నిర్ణయం తీసుకున్నామన్నారు.