చంద్రబాబు ఈయన ఐదేళ్ల పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గుంతకల్లు ఎంఎల్‌ఏ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న అతను ఏ ప్రాంతంలో కాలు పెడితే, ఆ ప్రాంతంలో కరువు సంభవించడం ఖాయం... పంటలు బాగా పండుతున్నాయని అనంత రైతు భావిస్తున్న తరుణంలో పంటల పరిశీలనకని చంద్రబాబు జిల్లాలో అడుగు పెట్టడంతోనే పంటలు కాస్త దిగుబడి లేక తిరిగి కరువు సంభవించిందని ఎద్దేవా చేశారు.
టిడిపి అధ్యక్ష పదవిని ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించి, ఐదేళ్లు రాజకీయ సన్యా సం పుచ్చుకుంటే కాంగ్రెస్ సర్కారు ఈ రాష్ట్రాన్ని సంతోషాంద్రప్రదే శ్‌గా మారుస్తుందని ఎంఎల్‌ఏ కొట్రికె చెప్పారు.