తెలుగుదేశం పార్టీ నేత, అదుర్స్ చిత్ర నిర్మాత వల్లభనేని వంశీ మోహన్ గన్‌మన్ ఉపంసహరణ సమీక్ష కమిటీ (ఎస్.ఆర్.సి) నిబంధనల ప్రకారమే తొలగించినట్లు పోలీస్ కమిషనర్ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు చేశారు.
తన ను హత్య చేసేందుకు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, అనంతపురానికి చెందిన మద్దెల చెరువు సూరి ప్రయత్నిస్తున్నారని ..వీరికి సీపీ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు వంశీ ఆరోపణలు కలకలం సృష్టించాయి.
అయితే ఆ ఆరోపణలు సీపీ ఖండించారు. ఆయ న ప్రాణానికి నగర కమిషరేట్ పరిధి లో ఎలాంటి హానిలేదని .. నగరంలో నెహ్రూ, బాజీ నుంచి ఎలాంటి ఆపదారాదని తెలిపారు. గన్ మన్ కోసం వంశీ స్వయంగా తనపై తానే హత్యాయత్నం చేయించుకునే అవకాశం ఉందని వంశీపైనే సీపీ ప్రత్యారోపణ చేయడం తో గన్‌మన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.