బంగారమే... సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి వెళ్ళిపోయింది...ఈ వారంలో గతంలో ఎన్నడూ లేనంతగా కాసు బంగారం ధర 15300 రూపాయలకు పెరిగి ఆల్‌టైమ్ హైలో నిలిచింది. గత ఏడాది ఇదే రోజుల్లో 11 వేల రూపాయలు ఉన్న కాసు బంగారం సంవత్సరం తిరిగే సరికి నాలుగువేల రూపాయలు పెరిగి 15100 రూపాయల వద్దki చేరటంతో జనం బంగారం షాప్స్ వైపు చూడడం లేదు.
పెళ్ళిళ్ళ సీజన్, కార్తీక మాసం మొదలైనా... ప్రకృతి వైపరీత్యాలతోపాటు, ధరలు కూడా అమాంతం పెరగడంతో కొనుగోళ్ళు తగ్గిపోయాయని...దీని ప్రభావం వల్ల బంగారం పనులపైనే నడిచే వర్క్‌షాపులపైన, ఇతర సిబ్బందిపైన తీవ్రంగా ఉంటుందని.. కనీస రోజువారి కూలి డబ్బు కూడా రాని పరిస్తితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.