5, మార్చి 2011, శనివారం

కాంగ్రెస్‌ - డిఎంకెల మధ్య సీట్ల చిచ్చు

తమిళనాట కాంగ్రెస్‌ - డిఎంకెల మధ్య ఎన్నికల అవగాహన చిలికి చిలికి గాలి వానగా మారి చివరికి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి ఎసరు పెట్టినట్లు ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధిక సీట్లు కేటాయించాలనటం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

ఈనేపథ్యంలో కరుణానిధి శనివారం మీడియాతో మాట్లాడుతూ డీఎంకె-కాంగ్రెస్‌ల మధ్య ఇంకా సీట్ల సర్థుబాట్లు పూర్తి కాలేని..తగినంత బలం లేకుండా ఎక్కువ సీట్లు ఆశించడం న్యాయం కాదన్నారు. కాంగ్రెస్ వైఖరి ఇలాగే కొనసాగితే కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటామని కరుణ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.