వెంకటేష్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్‌తో ఇటీవలనే 'నాగవల్లి' చిత్రాన్ని తీసిన బెల్లంకొండ ఆయనతోనే మరో చిత్రాన్ని చేస్తుండటం ఓ విశేషం. ఇక గోపీచంద్ మలినేనికి దర్శకుడిగా ఇది ద్వితీయ చిత్రం. రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'డాన్ శీను' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తొలి చిత్రంతోనే హిట్‌ను కొట్టిన ఆయన ద్వితీయ చిత్రాన్ని వెంకటేష్ వంటి ప్రముఖ హీరోతో చేస్తున్నారు. కాగా ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.