తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు వసున్న కధనాలను ఖండించారు పిసిసి ఛీఫ్ డి.శ్రీనివాసరావు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ...... ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కావాలని తాను అధిష్టానవర్గంని కోరలేదని, బరిలో తాను లేనని స్పష్టం చేశారు తన భవిష్యత్'ని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా నిర్ణయిస్తారని చెప్పారు.
కడప జిల్లాలో తెలుగుదేశం పార్ధీకి చెందిన వారితో రాష్ట్ర మంత్రులు సమావేశమై విందు రాజకీయాలు నడపడం ఆశ్చర్యమేమీ లేదని... వారికి బలంలేదు... ఆ స్ధానంలో తమ అభ్యర్ధికి ఓటు వేయించాల్సింది కోరటంలో తప్పేముంది.రాజకీయాలలో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరని, ఎన్నికలలో గెలుపు కోసం ఎవరి సహాయమైనా కోరవచ్చునని..దీనిని కొందరు అనవసర రాధ్ధాంతం చేస్తున్నారని జగన్ వర్గాన్ని ఎత్తి పొడిచారు డి.శ్రీనివాస్.