5, మార్చి 2011, శనివారం

యునెస్కో గుర్తించిన దేవాలయం

వెయ్యి సంవత్సరాల క్రితం చోళుల వంశానికి చెందిన రాజరాజ చోళులు తమిళనాడులోని తాంజావూరు జిల్లాలోని పెరుఉడయార్‌ శివునిగుడిని నిర్మించారు. దీనినే బృహదీశ్వర ఆలయం అనికూడా పిలుస్తారు. ఈ మధ్య యునెస్కో ఈ దేవాలయాన్ని గొప్ప చోళదేవాలయం అని గుర్తించింది. తమిళ నాడు దేవాలయాలకు ప్రసిద్ధి. ప్రభుత్వ లోగోకూడా దేవాలయమే. గతంలో మొఖల్‌లు, భౌముని సుల్తానులు, తురుష్కులుదాడిచేసిన దేవాలయాలు చెక్కు చెదరలేదు. బృహదీశ్వరాలయం సంస్కృతి, చిత్రకళ, శిల్పసౌందర్యం, మతం, భాషలకు పెట్టింది పేరు. చోళుల వంశం సముద్రతీరంవరకు విస్తరించింది. ఈ దేవాలయం 1010లో నిర్మితమైంది. దీని ప్రత్యేకత ఏమనగా విమాన గోపురం 2016 అడుగుల ఎత్తున వుంటుంది. ఎనిమిది టన్నులు గల స్థూపాన్ని 100 అడుగుల్లో నిర్మించారు. దీనినే 'సారపళ్ళమ్‌' అంటారు. ఒకటవ రాజరాజచోళుడు 985 నుండి 1014 వరకు పాలన చేశారు. శివుని చెంతన శాంతిని గ్రహించాడు. రాజరాజచోళుడు మిలట్రీని విస్తరించడంలో, స్థానిక వ్యవస్థను కట్టుదిట్టం చేయడంలో నేర్పరి.
బృహదీశ్వర ఆలయంలో మరొక ప్రత్యేకత నంది విగ్రహం. ఇక్కడ బృహన్నాయకి, గణపతి, సుబ్రహ్మణ్య, దక్షిణామూర్తి, నటరాజ, విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ పెయింటింగులు అందరినీ ఆకర్షిస్తాయి. 17వ శతాబ్దికి చెందిన ఈ కళాఖండాలు ఎంతో సుందరంగా వుండి ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయంలోని మరొక గోడపై శ్వేత ఐరావతంపై సుందరమూర్తి నాయనార్‌, వెళ్లడం కానవస్తుంది. మరొక చోళరాజరాజ గురువైన కరువూర్‌ దేవర్‌ పెయింటింగ్‌ కానవస్తుంది.
శివుని 81 నాట్యభంగిమలను ఈ దేవాలయ ప్రాకారాలపై చూడవచ్చు. మొత్తం నాట్యశాస్త్రమే ఇక్కడ కళ్లకు కట్టినట్టు గోచరిస్తుంది. ఓ రోజు ప్రధాన స్తపతి నంది విగ్రహం తదేక దృష్టితో చెక్కుతుండగా రాజరాజ రాజువెళ్ళి ఆ స్తపతి పక్కనే నుంచొని చూస్తున్నాడు. స్తపతి తన సేవకుడే పక్కన వున్నాడని తలచి తనకు ఒక కిళ్లిdని కట్టి ఇవ్వమన్నాడు. రాజు ఇచ్చిన కిళ్లిdని స్తపతి చూడకుండానే నోట్లో వేసుకున్నాడు.
స్తపతి తన పక్కన వున్నది రాజని గుర్తించక ఈ గొప్ప నందివిగ్రహాన్ని చెక్కిస్తున్న రాజుగారిని ప్రశంసిం చాడు. తరువాత పాన్‌ తింటున్న కిళ్లిd ద్వారా వచ్చిన ఉమ్మిని ఉయ్యటానికి పాత్రను ఇవ్వమన్నాడు. రాజు ఆ పాత్రను అలాగే ఇచ్చాడు. స్తపతి దానిలో ఉమ్మివేసి రాజును చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పాదాక్రాంతుడై క్షమాపణలు వేడుకున్నాడు. రాజు స్తపతిని లేవనెత్తి కౌగలించుకొని సప్తతికి సపర్యలు చేయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నాడు.
రాజరాజుకు ఇతరమతాలపై కూడా విశ్వాసం మెండు. నాగపట్నంలోని బౌద్ధుల విహారానికి ఒక గ్రామాన్నే కేటాయించాడు. బృహదీశ్వరాలయం తమిళ శైవ సిద్ధాంతానికి ప్రతీక. శివుడు సృష్టికర్త అలాగే రక్షకుడు, ధ్వంసకుడు కూడా. కర్మ నుండి విముక్తికై శివసాయుజ్యం పొందాలన్నాడు. శివునిలో అంతర్లీనం కాక పోయినా పాదాలవద్ద బిడ్డలుగానైనా ఉండాలన్నాడు. నటరాజ విగ్రహం శైవ సిద్ధాంతానికి ప్రతీక. శైవ సిద్ధాంతంలో దేవతారాధన ముఖ్యం.
నాయనార్‌ భక్తులు శివతత్వాన్ని ప్రచారం చేశారు. సంబంధర్‌, అప్పర్‌, సుందరమూర్తి, మాణిక్య వాసగర్‌, శైవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. మాణిక్యవాసగర్‌ రాసిన తిరువాసగం ప్రసిద్ధిచెందింది.
రాజరాజచోళుడు సముద్రంలో ప్రయాణించేవాడు. అనేక ద్వీపాలను జయించాడు. యునెస్కో తంజా వూరులోని దేవాలయంకూడా హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించడం ముదావహం.
తమిళనాడు సంస్కృతి పరిరక్షణలో తలమానికం వంటిది. ఈ దేవాలయ పరిరక్షణకు అందరూ నడుంబిగించాలి.
- దండు కృష్ణవర్మ