ప్రత్యేక తెలంగాణపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీని పార్లమెంట్‌లో నిలదీయాలని.. తెరాస అధినేత కేసీఆర్‌పై తెలుగుదేశం శాసనసభా పక్షం తీవ్ర స్ధాయిలో విరుచుకు పడింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శనివారం మీడియాలో మాట్లాడుతూ....తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
తెలంగాణా ఇచ్చేది కేంద్రమే అయినప్పుడు..అక్కడ నిలదీసి తెలంగాణా సాధించుకు వస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ సోనియా ఇంటి ముందు కూర్చొనకుండా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా పోరాటాలు చేస్తాం అనియూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లాలూచీపడి, కుమ్మక్కై కేసీఆర్ ఢిల్లీ తిరిగి వచ్చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీసారు.