26, ఏప్రిల్ 2011, మంగళవారం
'తేడా'..'మాడా'..ల తర్వాత 'థర్డ్‌మ్యాన్'
నూనూగు మీసాలు మొలిస్తే మగాడు, నాజూకు జడవుంటే ఆడది. అదే నూనూగు మీసాలు, నాజూకు జడ ఒక్కరిలోనే వుండటం సాధ్యపడుతుందా... సృష్టికి విరుద్ధమైనా అది సాధ్య అని 'థర్డ్‌మ్యాన్' (బొమ్మాకాదు బొరుసూ కాదు) అనే కొత్తకథాంశంతో నిరూపించబోతున్నామని ధన్వంతరి క్రియేషన్స్ అధినేత లక్ష్మయ్యచారి తెలిపారు. ఆడది, మగాడు కాని వాణ్ణి కొందరు 'తేడా' అంటారు. మరికొందరు 'మాడా' అంటారు. కానీ ఈ చిత్రం తర్వాత వారిని 'థర్డ్‌మ్యాన్' అంటారని, ఆ పేరు ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి పేరు తెస్తుందని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఇంద్రమోహన్ తెలిపారు. కథ, కథనాల విషయాల్లో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా, ముంబాయి, వారణాసి, గంగానది తీరాల్లో నిజమైన హిజ్రాలతో, అఘోరాలతో, హై టెక్నికల్ వాల్యూస్‌తో చిత్రీకరణ జరుపుతామన్నారు. లవ్, యాక్షన్ సెంటిమెంట్ అన్నీ సమపాళ్ళలో ఉన్నాయని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: పోలూర్ ఘటికా చలం, పాటలు: రామ జోగయ్యశాస్త్రి, బిక్కికృష్ణ కథ, దర్శకత్వం: ఇంద్రమో హన్, సమర్పణ: పార్వతమ్మ కె., నిర్మాత: కె.లక్ష్మయ్యచారి.