అస్సోం రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తున్నట్టు తమ పార్టీ విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళ వారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అస్సోంలో తమ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా విజయం సాధిస్తుంద ని, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం దేశం రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల తో తమ పార్టీ పటిష్టత మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసారాయన.