లోక్‌పాల్ బిల్లును కుందిo చాలని చూడటం దుర్మార్గమైన చర్య అని.. బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్‌లనూ తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం త్రిశంకు స్వర్గంలో వే లాడుతోందన్నారు.చట్టాలు, బిల్లుల ద్వారా అ వినీతి నిర్మూలన సాధ్యం కాదన్నారు. అవినీతి ఎజెండాతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రచారాలు చేపడతామన్నారు.భారతదేశంలో ఏ పార్లమెంటు ఎన్నికలకు ఖర్చు పెట్టని విధంగా కడపలో ధనం ఏరులై పారుతోందని నారాయణ ఆరోపించారు. ఎన్నికలు పేరు చెపితేనే భయపదీలా ఈ ఎన్నికల్ని మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసారాయన.