ఎస్.పి.జె. క్రియేషన్స్ పతాకంపై రవిచరణ్‌రెడ్డి దర్శకత్వంలో మనోతేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, అదితీశర్మ కథానాయికగా గూడూరు శివరామకృష్ణ నిర్మిస్తున్న 'బబ్లూ' చిత్రం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ వారంలో ఆడియోను విడుదల చేస్తామని చక్కటి కమర్షియల్ అంశాలు కలగలిసిన ప్రేమకథాచిత్రమిదని నిర్మాత శివరామకృష్ణ తెలిపారు. చక్రి సంగీతం ఓ హైలైట్ అని, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.