పుట్టపర్తి సత్య సాయి బాబా మహాసమాధికి రంగం సిద్ధమైంది. బాబా పార్థివదేహాన్ని సమాధి చేయడానికి వీలుగా కుల్వంత్ హాల్‌లో అన్ని ఏర్పాట్లూ చేశారు. ఏడు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుగల విస్తీర్ణంలో సమాధిని సిద్ధం చేశారు. బాబా అంత్యక్రియలకోసం పుణ్య నదీ జలాలు, ప్రత్యేక పట్టు వస్త్రాలు తెప్పించి ఉంచారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు బాబా మహా సమాధి కార్యక్రమం పూర్తి అవుతుంది.