తెలుగులో 'పండుగాడు, జాకీ'గా పరిచయమైన పునీత్‌రాజ్‌కుమార్ ఐఎయస్ అధికారిగా నిజాయితీ పరుడైన జిల్లా కలెక్టర్ అక్రమ మైనింగ్‌ను ఎలా అరికట్టాడు, ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన అనుభవాలేమిటీ? అనే కథాంశంతో 'పృథ్వి ఐ.ఎ.యస్.' చిత్రం రూపొందింది. గత సంవత్సరం కన్నడంలో 'పృథ్వి' పేరుతో విడుదలై ఘనవిజయం సాధిం చిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు.
పునీత్‌రాజ్‌కుమార్, సరసన నటించారు. మళయాలం, కన్నడలో పేరొందిన పార్వతిమీనన్ నాయికగా నటించింది. మణికాంత్ కద్రి సంగీతం అందించారు. జాకప్ దర్శకత్వంలో కన్నడంలో రూపొం దిన చిత్రాన్ని తెలుగులో రాజేష్ ఫిల్మ్ 'పృథ్వి ఐ.ఎ.యస్.' పేరుతో అనువ దిస్తోంది.