ఈ మధ్యనే దర్శకుడు దశరథ్ ప్రభాస్ తో రూపొందించిన 'మిస్టర్ పెర్ ఫెక్ట్' హిట్ టాక్ తెచ్చు కావటంతో.. కాస్త గాప్ లో తన తదుపరి చిత్రం కోసం ప్లాన్ చేసుకుంటున్నడట . ఐతే గతంలో ఈ చిత్రాన్ని నాగార్జునతో రూపొందించాలని భావించినా.. ఇప్పుడు తాను అనుకున్న కధకి నాగ్ కన్నా అల్లు అర్జున్ అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. దీంతో ఇటీవల దశరథ్ అర్జున్ ని కలసి కథ చెప్పడం జరిగిందట. కధ పక్కగా ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గుతున్నట్లు వుందని దీన్ని మార్చుకొంటే చేయటానికి అబ్యంతరం లేదని అర్జున్ చెప్పాడట. ఏది ఏమైనా వీరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్క డం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.