26, ఏప్రిల్ 2011, మంగళవారం

పోసాని 'నిత్య పెళ్ళికొడుకు' కేరాఫ్ జగదంబ సెంటర్ .. సెన్సార్ కట్స్

పోసాని కృష్ణమురళి టైటిల్‌ పాత్ర పోషించిన నిత్య పెళ్ళికొడుకు చిత్రంలో గౌరీపండిట్‌, అంజలి, భావన, శివాజీరాజా ముఖ్య పాత్రధారులు. సెవెన్‌ హిల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకాన జి.వి.సుబ్బయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అళహరి.

అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 27-1-2011న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

1. మొదటి రీల్‌లో చిత్రీకరించిన దృశ్యంలో గల 'మీ ఫ్రంట్‌ ఒరిజినలా ప్యాడింగా, మీ బ్యాక్‌ ఒరిజనలా ప్యాడింగా' అనే వాక్యం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

2. మొదటి రీలులోనే మరో దృశ్యంలో 'అమ్మాయిలకు అబ్బాయిలు కావాలి... వాళ్ళకు కూడా జిల్‌ వుంటాది' అనే డైలాగ్‌ తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

3. మూడవ రీలులో పెదవితో పెదవి కలిపి శిరీషను ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 4.12 అడుగులు ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

4. నాల్గవ రీలులో 'ముమైత్‌ ఖాన్‌' అని ఎక్కడ వచ్చినా అది వినబడకుండా తొలగించమన్నారు.

5. నాల్గవ రీలులోనే చిత్రీకరించిన ఓ సన్నివేశంలో భార్య స్వచ్ఛతను పరీక్ష చేసే మొత్తం దృశ్యాన్ని, హీరో అతని స్నేహితుడు మధ్య జరిగిన సంభాషణని శబ్దంతో సహా తొలగించారు.

6. రెండవ రీలులో నీటి జల్లులో రస్న, శిరీష పెదవి పెదవి కలిపి ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 2.14 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.

7. ఏడవ రీలులో డ్రగ్స్‌ వాడంకి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 30.09 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

8. ఏడవ రీలులో పబ్‌లో హీరో, ఐశ్వర్య పాల్గొనగా చిత్రీకరించిన డ్యాన్స్‌ని తొలగించి ఫ్లాష్‌లా చూపమన్నందున 46.09 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.

9. ఏడవ రీలులోని ఐటమ్‌సాంగ్‌లో ఎక్స్‌పోజింగ్‌లో కూడిన క్లీవేజ్‌ దృశ్యాలను తొలగించడం వల్ల 60.04 అడుగుల ఫిలిం కత్తిరించబడింది.

10. పదకొండవ రీలులోని 'మగాడు మానసికంగా శారీరకంగా వ్యభిచారం చేస్తాడు' అనే డైలాగ్‌ శబ్దంతో సహా తొలగించారు.

11. పదమూడవ రీలులోని 'లంగాగాడు, లుచ్చాగాడు పదాలను తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

12. పన్నెండవ రీలులోని 'పక్కలో పడుకున్నావా', 'పిచ్చి నా కొడకా', 'బ్రోకర్‌ వెధవా', 'బుడ్డే కె బాల్‌' పదాలను తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

13. 14వ రీలులో ఆహుతయ్యే దృశ్యాలను సగానికి తగ్గించడం వల్ల 18.07 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

14. పన్నెండవ రీలులో గల 'ఆ చీర చింపింది నేను, నేనే కట్టుకుంటానంటే వద్దంటారేంటి?' డైలాగ్‌ని తొలగించి శబ్దం వినరాకూదన్నారు.

15. రెండవ రీలులో చిత్రీకరించిన 'బాబూ అక్కడ చెయ్యి పెట్టకూడదు రెస్ట్రిక్టెడ్‌ ఏరియా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.

16. తొమ్మిదవ రీలులో చిత్రీకరించిన దృశ్యంలో 'అక్కుం బక్కుం లేదా' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

మొత్తం మీద 16 కట్స్‌లో 163.07 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది. 14 రీళ్ళ నిడివిగల 'నిత్య పెళ్ళికొడుకు' 11.3.11న విడుదలయింది.