ఎన్నికల సంఘం మరోసారి ఓటరు సవరణకు శ్రీకారం చుట్టింది. ఫొటో ఓటరు జాబితా సవరణతో పాటు కొత్తగా ఓటరు పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వచ్చేనెల 23వ తేదీ వరకు ఓటర్లు ఓటరు జాబితాలో సవరణ, నూతన ఓటర్ల పేర్ల నమోదుకు గడువు విధించింది..
ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన బూత్‌స్థాయి అధికారుల వద్ద ము సాయిదా ఓటరు జాబితాలు ఈనెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. 1 జనవరి, 2011 నాటికి 18 సంవత్సరాలు నిండినపక్షంలో ఓటర్ల జాబితాలో ఓటరు నమోదు చే సుకునేందుకు అర్హులు. కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేవారు తమ ఇంటి నంబరు పరిధిలోగల బూత్‌స్థాయి అధికారి వద్దకు స్వయంగా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఫారం నెం.6 దరఖాస్తును పూరించి వచ్చేనెల 23లోగా అందజేయాలి. అలాగే ఓటరు జాబితాలో పేరు నమోదు విషయంలో ఏదైనా అభ్య ంతరాలు ఉన్నా, ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో నుంచి తొలగించాల్సిన ఉన్నా ఫారం నం.7ను పూర్తి చేసి బూత్‌స్థాయి ఎన్నికల అధికారికి అందజేయాలి.
ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు తప్పుగా నమోదైన పక్షంలో సవరణ కోసం ఫారం నం.8ను సమర్పించాలి. ఒకవేళ నివాసము వేరేచోటికి మార్చినట్లయితే ఫారం నం.8-ఏ పూర్తిచేసి అధికారులకు అందజేయాలి. సవరణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకువచ్చే నెలలో మూడు ఆదివారాల్లో అవకాశం కల్పిస్తారు. 7,13,21 తేదీల్లో ఎన్నికల సంఘం జిల్లాలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది.
ఆయా తేదీల్లో కూడా ఓటర్ల తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.వచ్చేనెల 23లోగా సమర్పించి న అన్ని రకాల దరఖాస్తులపై పూర్తిగా విచారణ జరిపి 5 జనవరి, 2011న సవరించిన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తుంది