31, అక్టోబర్ 2010, ఆదివారం

‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ పడకేసింది.

ప్రజా సమస్యలను అధ్యయనం చేసి పోరాటాల ద్వారా పరిష్కరించాలన్న లక్ష్యంతో జిల్లాలో ప్రారంభమైన ‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ కార్యక్రమం పడకేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే పది రోజులు ఆలస్యంగా ప్రారంభమై గందరగోళం నడుమ కొనసాగుతోంది. ఏ రోజు, ఏ నియోజకవర్గంలో కార్యక్రమం జరుగుతోంది, ఎవరెవరు హాజరవుతారు, ఏం చేస్తున్నారనే కనీస సమాచారం కూడా జిల్లాల నేతలకు తెలియని పరిస్థితి. దీంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

2004 నాటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్యపోరు ద్వితీయ శ్రేణి నేతలకు సమస్యాత్మకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో యాత్రలు అరకొరగా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధుల బిజీ షెడ్యూల్ నేపథ్యంలో యాత్రలు పరోక్షంగా అటకెక్కాయి. నేతలు ఖాళీగా ఉన్నరోజే అడపాదడపా జరుగుతున్నాయి...మొత్తం మీద క్యాడర్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.