31, అక్టోబర్ 2010, ఆదివారం

ఖైదీల కన్నా హీనంగా...హాస్టల్ విద్యార్ధుల జీవనం

బిసి బాలురకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ వసతి గృహాలు ఉండాలి. బిసి బాలికలకు ఇంతే మొత్తంలో వసతి గృహాలు ఉండాలి. అయితే వీటిని చారా వరకు ప్రభుత్వం ప్రారంభించలేదు. పో నీ ప్రారంభి౦చిన వాటికి సక్రమంగా డబ్బు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వసతి గృహాల్లోని విద్యార్థులకు భోజన వసతికి గానూ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో రూ. 16, కాలేజీల్లో రూ. 17.75 ఇస్తున్నారు. ఈ మొత్తంతో విద్యార్థులు సక్రమంగా మూడు పూటలా తినడం, బాగా చదువుకోవడం సాధ్యమేనా..? గుడ్లు, పండ్లు, పాలూ తగ్గించారు. గుడ్లు ఏడు నుండి అయిదుకు తగ్గించారు. జైల్లో ఉండే ఖైదీలకు రోజుకు రూ. 30 వరకు ఖర్చు చేస్తున్నారు. నేరాలు చేసే ఖైదీగా జీవితాలు అనుభవిస్తున్న వారి పాటి కూడా తాము లేమా? అన్న భావన విద్యార్ధుల్లో వ్యక్తమవుతోంది. .

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కిలో రూ. 2 చొప్పున బియ్యం సరఫరా చేస్తోంది. వసతి గృహాలకు మాత్రం కిలో రూ. 4 కు సరఫరా చేస్తోంది. హాస్టల్స్‌లో ఉండే వారు దనికుల పిల్లలా? హాస్టల్స్‌కు కూడా కిలో రూ.2కు బియ్యం సరఫరా చేస్తే మిగిలిన రెండు రూపాయలు విద్యార్థులకు ఖర్చు చేసేందుకు అవకాశం లభిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం హాస్టల్‌ విద్యార్థులకు అమలు చేయడం లేదు. ఈ పథకాన్ని వర్తింపజేస్తే మరో రూ. 3.50 విద్యార్థులకు కలిసివస్తుంది. ఈదిశాగా ప్రభుత్వం ఆలోచించాలి