నాగార్జున కథానాయకుడుగా అనుష్క, ప్రియమణి నాయికలుగా కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై వీరూపోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద రెడ్డి నిర్మిస్తున్న ‘రగడ’ బ్యాంకాక్ షెడ్యూల్‌కి సిద్ధమైంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నఈ చిత్ర ప్రధానతారాగణంపై ఓ పాట సహా కొన్నిసన్నివేశాలు నవంబర్ 6నుంచి 17వరకూ బ్యాంకాక్‌లో చిత్రీకరణ ఉంటుంది. డిసెంబర్ 17న రిలీజవుతున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, రఘుబాబు, ప్రదీప్‌రావత్, దేవ్‌గిల్, సుశాంత్ సింగ్, సత్యప్రకాష్, మాస్టర్ భరత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తి, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: తమన్.ఎస్, నిర్వహణ: కె.చెంచురెడ్డి, సహనిర్మాతలు: డి.విశ్వచందన్‌రెడ్డి, డి.వెంకట కైలాష్‌రెడ్డి, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: వీరు పోట్ల.