31, అక్టోబర్ 2010, ఆదివారం

వ్యాపారులు సిండికేట్‌.. టాపాసుల రేట్లు చుక్కలంటడం ఖాయం

దీపావళి పండగ వస్తోంది. టపాసుల దుకాణం పెట్టాలి... 15 రోజుల్లో పెట్టిన పెట్టుబడికి ఆపై రెట్టింపు ఆదాయం సంపాదిం చొచ్చు. అధికారుల అనుమతి అక్కర్లేదా..? ఆ...ఏముంది... అధికారుల కెంతో కొంతిస్తే చాలు అనుమతదే వచ్చేస్తోంది. .. ఈ క్రమంలోనే స్థానిక పోలీసు,రెవెన్యూ, ఫైర్‌ అధికారులు అనుమతులివ్వాలని వచ్చిన వారి నుంచి అక్రమంగా ఒక్కోక్క స్థాయి అధికారికి ఒక్కోక్క షాపుకు రూ. 8వేల చొప్పున ముడుపులు పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులకు స్థాయిని బట్టి రేటును నిర్ణయించిన వ్యాపారుల నిబంధనలకు విరుద్దంగా పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు నెలకొల్పుతున్నారు.

బాణాసంచా దుకాణాలను ఎక్కడ పడితే అక్కడ నెలకొల్పకూడదని అధికారులకు తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా... వివరాలు తెలుసుకోకుండానే వ్యాపారులిచ్చే ప్రలోభాలకు తలొగ్గి విచ్చలవిడిగా అనుమతులిస్తూన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వారు అధికారులతో, వ్యాపారులతో కుమ్మక్కై మున్సిపల్‌ శాఖ అధికారులు వంత పాడుతూ థానా. అంటే తంధనా అన్నట్లు వ్యవహరిస్తుండడంతో పట్టణాలకు దూరం గా దుకాణ సముదాయాలను ఏర్పాటు చేయాలన్న నిబంధనలకు అధికారుల నేరుగా తూట్లుపొడుస్తుండటంతో.. వ్యాపారులు దుకాణాలను ఇస్తానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అధికారులు అమ్యాయాలకు అలవాటుపడి నిబంధనలు తుంగలో తొక్కు తున్నట్లు ప్రజలు ప్రాణాలను ఫణంగా పెట్టి అక్రమ అనుమతులకు దిగుతున్నారు.

అతికష్టంగా దసరా పండగను జరుపుకున్న ప్రజలు దీపావళీ పండగను జరుపుకునేందుకు సిద్దమవుతున్న తరుణంలో బానాసంచా వ్యాపారులు సిండికేట్‌గా మారి టాపాసుల రేట్లను భారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారం నిర్వహించేవారు సిండికేట్‌గా ఏర్పడి ధరలను భారీ ఎత్తున పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నా యి. పేద మధ్య తరగతి ప్రజలు టాపాసులను కొనాలంటే రూ. 1000పైనే జేబులో ఉంటేనే బానా సంచ దుకాణానికి వెళ్లా ల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నేటివరకు ఏ ఒక్కశాఖ అధికారి కూడా దీపావళీ పండగను పురస్కరించుకుందామనే బానాసంచాలపై ఏ ప్రమాదాలు పొంచి ఉంటాయో కనీసం ప్రజలు అవగాహాన కల్పించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.