2, నవంబర్ 2010, మంగళవారం

షర్మిలా ఆందోళనకు దశాబ్దo


సామాన్య జనం పాలిట శాపంగా మారిన సైనిక శాసనాన్ని రద్దు చేయాలని దశాబ్ద కాలంగా ఆందోళన చేస్తున్న సహనశీలి ఈరమ్ షర్మిలా చాను...

ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో 10 మంది పౌరులను పొట్టనపెట్టుకోవడంతో మణిపూర్‌లో వివాదస్పద 1958 నాటి సైనికదళాల ప్రత్యేక చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఆమె నిరాహార దీక్ష చేపట్టి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి..

జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు జేఎన్ ఆస్పత్రిలో ముక్కు ద్వారా ద్రవాహారాన్ని ఎక్కిస్తున్నా... శాంతియుత సమరాన్నే శ్వాసగా చేసుకుని కర్కశ సైనిక చట్టంపై పోరాటం చేస్తున్న...చెక్కు చెదరని సంకల్పానికి ప్రతీక ... మొక్కవోని ఆత్మవిశ్వాసానికి ఆ చైతన్యమూర్తి....ప్రత్యక్ష నిదర్శనం

షర్మిలా దీక్ష చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా పలు సామాజిక సంఘాలు మణిపూర్‌లో పలుచోట్ల బైఠాయింపులు జరిపాయి. విప్లవమూర్తికి సంఘీభావంగా రిక్షావాలాలు ర్యాలీలు నిర్వహించారు.