స్వాతంత్య్రం సిద్దించి 60 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం విద్యా ఆవశ్యకతను గుర్తించింది. దేశం అభివృద్ది చెందాలంటే గ్రామీణా ప్రాంతాల్లో ప్రాధమిక స్ధాయి నుండి విద్య పెంపొందితే దేశం అభివృద్ది పధంలో నడుస్తుందని, ఎట్టకేలకు ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. ఇందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఒక దశలో డిటెన్షన్ సిస్టమ్ అమలు పరచాలని ప్రభుత్వం యోచించింది. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో అమలకు సాధ్యం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకుంది. అయితే సంవత్సరం కిందట కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్ధాయి నుండి విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచడం ద్వారా ప్రజలను చైతన్యం చేయవచ్చునని ఇది బాల్య దశ నుండే అమలుపరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చనని భావించి ఈ చట్టానికి రూపకల్పన చేసింది.
విద్యాహక్కు చట్టం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు తప్పనిసరిగా విద్యనందించాలనేది ఈ చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో ఈ పథకం అమలు జరుగుతుందని ఏడాది కిందట కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చినప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చినప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలులో జాప్యం చేసింది కాగా ఇటీవల ఇందుకు సంబంధించిన విధి విధానాలను సూచిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో జారీ చేశారు. దీంతో ప్రాధమిక విద్యా హక్కు చట్టం అమలుకు రంగం సిద్దమైంది.