తెలుగుదనం మిళితం చేసుకుని తెలుగు భాషని, పాటని, మాటని, తనలో నింపుకుని
తెలుగు జానపద కళారూపాలలో విశిష్టత దక్కించుకున్న బుర్రకధలు...
నిన్నటి సమాజంలో చైతన్య స్పూర్తిని రగిలిస్తూ... సాగిన ఎన్నో జనపదాలను...
జానపదకళల్ని మనకున్న నిర్లక్ష్యం మూలంగా అంతరించిపోయాయి.
ఈ పరిణామంలోనే బుర్రకథలు కూడా చేరుతుండటం ఆందోళన కలిగించే విషయం...
నిన్నటి వరకు సమాజంలో... జరుగుతున్న పరిణామాలను సామాన్య జనం గుండె తలుపు తట్టి మరీ వివరించే ఈ బుర్రకధల కేవలం ప్రభు త్వ ప్రచార కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై పోతూ తమ ఉనికిని నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. ఈ కళకు సంబం ధించిన కళాకారులు కూడా భుక్తి కోసం వేరే వృత్తులవైపు పయనించా ల్సిన దుస్ధితి నెలకొంది. జానపదాలు పేరు చెపితేనే ముందుగా భళరా.. భళి..లాంటి ఎన్నో ఊత పదాలని పరిచయం చేయటమే కాకుండా సంద ర్భోచితంగా హాస్యాన్ని కరుణ రసాన్ని, భీభత్స రసాన్ని ఇలా నవరసాలను మేళవించి సాగే బుర్రకధలే గుర్తుకు వస్తాయి.
నాటి తరంలో పండగొచ్చినా... పబ్బమొచ్చినా... జాతర జరిగినా... తీర్ధా లు చేసినా... భక్తి పారవశ్యంలో మునిగి తేలే జనాలు సినిమాల కన్నా జాన పదకళలలోని మాధూర్యాన్ని ఆస్వాదించేందుకే మొగ్గు చూపే వారు. అందునా అన్నీ కలగలిసిన బుర్రకధలైతే మరీనూ...అసలు ఈ బుర్ర కధలు జనం నడుమనే పుట్టి పెరిగాయని, వస్త్రధారణలోనూ భిన్నంగా ఉంటూనే సంస్క ృతి సాంప్రదాయాలకు అతి పెద్ద పీట వేస్తూఉన్న క్రమం లో అనేక రకాల వాయిద్యాలు పుట్టు కొచ్చాయి. ఈ క్రమంలోనే ఆయా వాయిదాలు పేర్లకు తగ్గట్టు ఒగ్గు, కొమ్ముల, శారద కొండ్రు, పంబల ఇలా అనేక కులాలు ఏర్పడి జానపదాల కోసం ప్రత్యే కించింది నాటి సమాజమని.. జనపదాలతో జనుల ను విజ్ఞాన వంతులు చేసేందుకు అనేక మంది చేస ిన కృషి ఫలితంగా జముకు, ఒగ్గుపాటలు నుండి బుర్ర కధలు ఉద్భవించినట్లు కళాకారులు చెప్తారు. ఆపై యక్షగాన ప్రభావంతో వినోదం కలగ లిసి దేశీయ కళగా రూపాంతం చెందిన బుర్రకధలు ఈ నాటివి కావని, అనేక కాలలలో జరిగిన రచనల్లో బుర్రకధలపై ప్రస్తావన ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. 13 వ శతాబ్ధానికి చెందిన పాల్కురికి సోమన్న శక్తి కధ లు, 14వ శతాబ్ధంలో కాటమ రాజు, కుమార రాముని, గాంధారీ కధలు, 15వ శతాబ్ధంలో శ్రీనాధుడు సైతం జనం కోసం వీరగాధలను సామాన్య జనం భాషలో రచించి కళాకారులకు అందించాడని, ఇలా అంచెలంచెలు గా కొత్త పరిణా మాలను సంతరించుకుని రూపొందిన ఈ కళ తొలి నాళ ్లలో తంబుర కధగా ఆపై తంబురకు బుర్ర ఆకారం ఉండటం వల్ల బుర్ర కధగా రూపాంతం చెందింది. అయితే మిగిలిన జాన పదాలకు భిన్నంగా ఈ కళలో వస్త్రధారణ ఎంత ముఖ్యవెూ, ఛందస్సు, అలంకారాలు, నవరసాలు, నృత్యం, శృతి కలిగిన గానం కలగలిపి కధకుడు కధను రసరమ్యంగా చెపుతుంటే... వంత చెప్పే వారు హాస్యన్ని పండించే వారు చెరోవైపున జనానికి చెపుతున్న కధపై ఏమాత్రం విరక్తి కలగకుండా... సామాజిక అంశాలను కూడా మేళవించి.. సందర్భోచిత హాస్యంలో ముంచెత్తడం కూడా అంతే ముఖ్యం.
అనేక రూపాలు
ఈ బుర్ర కధల్లోనూ ప్రభోదాత్మకాలు, చారిత్రకాలు, మతకధలు, పౌరా ణికాలు, పతివ్రతుల కధలు ఇలా అనేక రూపాలున్నాయి. ప్రభోత్మకా లలోనూ రాజకీయాలు, సాంఘికాలు, ప్రచారకాలుగా విడదీసి చూస్తే. పలువురి రాజకీయనేతలకు చెందిన జీవితాలపై కొందరు బుర్ర కధల ను రాయగా సమాజంలోని రాజకీయ పరిస్ధితిని ఎప్పటికపðడు జనాలకు అర్ధమయ్యేలా చిన్న చిన్నకధల రూపంలో చెప్పే ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని ఎక్కువగా కమ్యూనిస్టు పార్టీలే అవలంబించి తన సిద్దాంతాలను జనం మధ్యకు తీసుకువెళ్లేందుకు ఉపయోగించు కున్నాయి. లంచగొండితనం, వరకట్నం, వివక్ష, ఇలా అనేక సామాజిక అంశాల నుకధలుగారూపొందించారు. సమాజం లో జరుగుతున్న స్ధితిగతులపై జనాల్ని చైతన్యవంతం చేసే బాధ్యతల్ని బుర్రకధలు వహించాయి. అలాగే ప్రభుత్వం కూడా తాను ప్రవేశ పెడుతున్న పధకాలను, ప్రగతిని, పేదలకు చేరువ చేసేందుకు తన ప్రచారాన్ని బుర్రకధలసాయంతో ముందుకు తీసుకుపోయింది. చారిత్రికా ల విషయానికి వస్తే... అల్లూరి సీతా రామ రాజు, భగత్ సింగ్, ఝాన్సీ లకి్ఝ భారు, ఇలా అనేక మంది వీరయో ధుల చరిత్రల్ని సామాన్యుడికి అర్ధమ య్యేలా వివరిస్తూ... నాడు జరిగిన స్వాతంత్ర పోరాటానికి సామాన్య జనాలను కూడా సమాయుత్తం చేసిన కళల్లో బుర్రకధలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. అలాగే బొబ్బిలి యుద్దం, పల్నాటి యుద్దం, బాల చంద్రుడు ఇలా అనేక చరిత్ర కధలు కడా బుర్ర కధల రూపంలో జనాలకి చేరువయ్యాయి.
ఇక పౌరాణికాలలో కురుక్షేత్రం, వీరాభిమన్యు, ఉత్తర గోగ్రహణం, భక్త ప్రహ్లాద, భగవద్గీత, శ్రీకృష్ణ విజయం ఇలా పౌరాణిక నాటక రూపాలకు హాస్యాన్ని రంగరించి సామాన్య జనం భాషలోనే మరిం త దగ్గర చేసేందుకు ఉపయోగ పడ్డాయి బుర్రకధలు.
పతివ్రతల కధల్లో, బాలనాగమ్మ, మల్ల మ్మ, సతీ అనసూయ ఇలాంటి వారి కధలు స్త్రీలలో పాతివ్రత్య మహత్యం తెలియ చేస్తునే వారిలో ఎనలేని విశ్వాసం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఓ విధంగా ఆత్మ స్ధైర్యాన్ని పెంపొందించాయి.
మత కధలలో... శివ మహత్యం, విష్ణులీలలు, శ్రీనివాస కళ్యాణం ఇలా అనేక దేవుళ్ల కధలని జనంలో భక్తి భావన పెంపొందించేందుకు ఉపయోగ పడ్డాయి.
జగద్విత బుర్ర కధల బృందాలు
బుర్ర కధల చెప్పేందుకు మన రాష్ట్రంలో అనేక బృందాలు జగద్విదితమ య్యాయి, కాకుమాను, నాజర్, లకి్ఝ కాంత వెూహన్, విఠల్ బ్రదర్స్, జూనియర్ నాజర్, బెనర్జీ, కుమ్మరి మాస్టారు, నిదవోలు, అచ్చుతరామ య్య, పడవల శ్రీకృష్ణలే కాకుండా నిత్యం జానపదాలపైనే తమ గమనా న్ని సాగించే ప్రజా నాట్య మండలిలో ప్రత్యేక శిక్షణ తీసుకుని ఎన్నో జన చైతన్య కధలను బుర్రకధల రూపంలో అందించిన వీరమానేని సరోజ, వెూటూరి ఉదయం, తాపీ రాజమ్మ, కొండేపూడి రాధ ఇలా అనేక మంది మహిళా కళాకారులు తమ కళా ప్రదర్శలతో ప్రజలను రంజింప చేసా రు.
వీరిలో కొందరు స్వర్గస్తులు కాగా... మరి కొందరు తమ తరు వాతి తరానికి ఈ కళని అందించలేక పోతున్నామని వ్యధ చెందుతున్నారు.
ఇక బుర్ర కధలకు ఆద్యుడిగా పిలవ బడే నగ్నముని అనేక కధలను బుర్ర కధల కళాకారులు జనాలకి విని పించగా. నిన్నటితరంలో... దండు మూర్తి శ్రీ, నదీరా, సుంకర, నాజర్, కామాను, వారణాసి, బద్దిరెడ్డి, ద్వారహిత, సత్యనారాయణ, ఓలే టి ఇలా పలువురు కళాకారులు అనేక కధలను జనపదం లోకి మార్చి... వాటికి హస్యోక్తుల్ని ... సమాజ పరిస్ధితులన్ని అద్ది ... ఈ బుర్రకధలకు ఉన్నత స్ధానం కలిపించడంలో తమ జీవితా లనే అంకితం చేసిన వారు లేకపోలేదు.
రికార్డింగ్ డాన్సులుగా మారిపోతున్న బుర్రకధలు
గతంలో విజయనగరం జిల్లాకు చెందిన కుమ్మరి మాష్టారు బుర్ర కధ అంటే జనం పడి చచ్చెవారంటే అతిశయోక్తి కాదు. ఇందు కు కారణం మధ్య మధ్యలో ఆయన చిన్నారులతో భరతనాట్యం, కూచిపూడిలాంటి ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయటం కారణం కావచ్చు .
కానీ నేడు అడపా దడపా చాలా గ్రామాలలో బుర్ర కధలు జరుగుతున్నా.. వాస్తవానికి అక్కడ కధల కన్నా... రికార్డింగ్ డాన్సులుగానే కనిప ిస్తున్నా యి. ముందు ముగ్గురుతో ప్రారంభమయ్యే బుర్రకధ వ్యంగ్యోక్తులతో ఆరంభించి ద్వందార్ధాల సంభాషణ లతో పల్లవించి...చివరికి రికార్డింగ్ డాన్సు
లుగా మార్చేస్తారు. ఉత్తరాంధ్రా జిల్లాలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ... యువతపై వల వేస్తూ... కొందరు సొమ్ము చేసు కుంటున్నారన్న ఆరోపణలూ బొలెడు న్నాయి.
సినిమాలలోనూ బుర్రకధలది ప్రత్యేక స్ధానం..
మన పాత చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... అనేక సందర్భాలలో బుర్ర కధలని వినియోగించుకుని కధలను ముందుకు సాగించేవారు. నాలుగు దశాబ్ధాల పాటు బుర్రకధలకే తన జీవితాన్ని ధారబోసిన నాజర్ మాష్టారు తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే.
ఊత పదాలూ.. వంతలూ.. బోలెడు...
బుర్రకధ కళాకారులు సందర్భాను సారంగా అనేక ఊత పదాలను, వంతలని శ్రావ్యంగా వినిపిస్తూ... ప్రజలని ఆయా సన్నివేశాలలోకి తీసు కుని వెళ్లిపోతుంటారు. విషాధఘట్టాలు వచ్చేపðడు ఆయ్యో... అంటూ అని విలపిస్తునే... హరి.. హరీ, రామా.. అంటూ వంత పాడతారు. అలాగే సంతోషకర ఘట్టాలలో భళా భళి, భేష్, తుమ్మెదా... తందానా... తానెతందనానా.., శహభాష్ అంటూ పాడతారు. ఒక కధకుడు వినార భార త వీర కుమరా విషయము చెపుతానూ... అంటూ ప్రారంభించి వినరా ధీరా విజయం మనదేరా.. అంటూ యుద్ద సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు వీర రసాన్ని ఉద్రిక్త స్ధితికి తీసుకెళ్లి పదునైన భావంతో జనం గుండెల్ని హత్తుకు పోయేలా జనరంజకంగా కధల్ని చెప్తారు.
సాంకేతిక విప్లవం వూపందుకున్నాక సినిమాలు చాలా జనపద కళల్ని నాశనం చేసాయి. టివిలు వచ్చాక పూర్తిగా వాటి ప్రభావం పడి జాన పదాల వైపు కన్నెత్తి కూడా జనం చూడటం మానేసారు. ఒకపðడు బుర్రకధనే నమ్ముకుని ఎన్నో కుటుం బాలు తమ జీవనాన్ని కొనసాగించేవి. దీన్ని వంశ పారంపర్యం వృత్తిగా చేపట్టిన కుటుంబాలు కూడా అనేకం.
ఒక కధని ఏడేసి రోజులు చెప్పినా జనం విని ఆదరించే స్ధాయి నుండి గంట కూడా బుర్రకధని వినే ఓపిక లేని స్ధితికి మనం చేరుకున్నాం ఇపðడు. మన ప్రాచీన కళల మీద మనం చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా అవి తెరమరుగు అవుతున్నాయన్నది వాస్త వం. ఈక్రమంలో తమ తంబరల లో విషాదాన్ని నింపుకుని ఆదు కునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది బుర్రకధ కళాకారుల కుటుంబాలు.
వీటిని కేవలం ప్రచారాలకే పరిమితం చేస్తున్న ప్రభుత్వాలే కాదు... జనం కూడా ఈ జానపదకళ ఆదరిస్తే కానీ భవిష్యతరానికి ఈ వారసత్వ సంపదని అందీయలేని పరిస్ధితి నేడు నెలకొందనటంలో సందేహంలేదు.
మహిళలదీ అగ్రస్ధానమే...
బుర్రకధల దళాలలలో మహిళలకూ పెద్ద పీట దక్కిందని చెప్పాలి. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన లక్షి, దంపుడు లక్ష్మి, శ్రీదేవి సిస్టర్స్ ఇలా అనేక మంది మహిళలు బుర్రకధలలో తమ సత్తా చూపిం చారంటే సందేహం లేదు. అనేక కధారూపాలతో పాటు మగవారికి ధీటుగా హాస్యోక్తులు ఒలికించడంలో వీరు తమ ప్రతిభాపాటవాలు చూపించారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలలో వారి పేర్లతోనే అనేక బుర్రకధ దళా లు ప్రారంభమయ్యాయి.
కానీ నేడు తగిన ఆదరణ లేక పోవటంతో దాదాపు అన్ని దళాలు కేవలం ప్రభుత్వ ప్రచారానికే పరిమితమై పోతున్నాయన్న ఆందోళనతో పాటు అనేక మంది బుర్ర కధ కళాకారులు పస్తులుండాల్సిన పరిస్ధితి నెల కొందని ఆవేదన సర్వ్‌త్రా వ్యక్తమవుతోంది.
నాజర్ గానానికి ముగ్ధుడైన సాలూరి
సినీ పరిశ్రమలో బుర్రకధలు చెప్పడంలోనూ... చెప్పించడంలో బుర్రకధలకు ఆద్యుడిగా చెపðకునే నాజర్ మాష్టారు పూలరంగడు చిత్రం కోసం అక్కినేని నాగేశ్వరరావుకి బుర్రకధ నేర్పించారు. అగ్గి రాము డు, భలే బావ, నిలువు దోపిడీ, పెత్తందారులు, మనుష్యులంతా ఒక్కటే తదితర చిత్రాల్లో బుర్ర కధ కళాకారుడిగా కనిపించి మెప్పించడమే కాకుండా బుర్రకధ సన్నివేశాలలో ఘంటశాలతో పాట ని, ఎన్టీఆర్, రాజబాబు లాంటిి అగ్రనటులతో డైలాగులు చెప్పించి రస రమ్యత చేకూర్చే వారు. ప్రము ఖ సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు ఆతని గళమాధుర్యానికి ముగ్ధుడై సినీ పాటల అవకాశాన్ని ఇస్తానని చెప్పినా.. వినకుండా తానీ సినీ ప్రపంచంలో నిలువలేనని వచ్చేసి... జీవిత చరమాంతకం వరకు బుర్రకధలకే అంకితం చేసారు. నాజర్ మాస్టారు చేసిన సేవలకు పద్మశ్రీనిచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది.
ఉత్తరాంధ్రాకి పేరు తెచ్చిన కుమ్మరి మాష్టారు
సినీ పరిశ్రమలో బుర్రకధలలో అడపా దడపా కనిపించిన వారిలో విజయనగరంకి చెందిన కుమ్మరి మాస్టారు ఒకరు. దారా అప్పల నారాయణ అసలు పేరైనా బుర్రకధ దళంలో ఆయన పేరు కుమ్మరి మాష్టారుగానే స్ధిర పడిపోయింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడే అయినా... జానపద కళలపై ఉన్న మక్కువతో బుర్రకధల్ని సొంతగా నేర్చు కోవటమే కాకుండా...తన సహచరులైన కుమ్మరి జానకి, రొంగలి సత్యన్నారాయణ మూర్తిలకు నేర్పి వారితోతో కల్సి 1992 వరకు వేలాది ప్రదర్శనలు ఇచ్చా రాయన. ఉత్తరాంధ్రా జిల్లాలలో ఏ ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా ముందు కుమ్మరి మాష్టారి బుర్రకధ ఉండి తీరాలనే స్ధాయికి ఆయన ఎదిగారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆంధ్రాయూనివర్శిటీ ఈతనిని కళా ప్రపూర్ణ అవార్డుతో సత్కరించింది.