15, నవంబర్ 2011, మంగళవారం

తెలుపు నలుపైతే.....పొరపాటు లేదోయ్‌...

నిన్న మొన్నటి వరకు నలుపు దుస్తులు ధరిస్తేనే శనీశ్వరుడు పట్టిపీడిస్తారని..

ధవళ వస్త్రాలవైపే మోజు చూపించిన సమాజం నేడు అంచెలంచెలుగా...

తన ధోరణి మార్చుకుంటూ నలుపు వైపు పయ నిస్తోం ది.

చీకటి లేకుంటే వెలుగు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు ఈ క్రమంలోనే..

మన నిత్య జీవిత గమనం లో నలుపు ప్రాధాన్యత క్రమేపీ పెరుగుతోంది.

నిత్యం పూజించే నర, నారాయణులు నల్లని వారే.. మనం వాడుకునే ఎన్నో వాహనాలు నలుపు రంగు లోనే ఉంటాయి. ఇక మన వాహనాలు పరుగులు తీసే రోడ్డు దాదాపుగా నలుపే.. న్యాయ దేవత కళ్లకు కట్టే రిబ్బన్‌ నలుపు, న్యాయ వాదుల కోటు నలుపు, మనం చేతికి తొడిగే వాచ్‌, కాలికి వేసే చెప్పు, కళ్లకి తొడిగే అద్దాలు ఇలా ఏదైన నలుపు కి ప్రాధాన్యత పెరిగి నేటి

యువతరం నలుపు డ్రస్సులంటే తెగ మోజు పడుతు న్నారు.

ఒక్కప్పుడు పెళ్లిళ్లు,పేరంటాలలో తెలుపు బట్టలతో ధగధగలాడిపోయిన వారుసైతం నేడు నలుపుదుస్తుల వైపు మక్కువ చూపుతున్నారు. అంతే కాదు మన సినీతారలు వచ్చే ఏఫంక్షన్‌ అయినా తీసుకోండి దాదా పు ఈ తారలంతా నలుపు దుస్తులతోనే దర్శన మిస్తారు. అందుకు ప్రత్యేక కారణం... అభిమానులని ఇట్టే ఆకట్టుకునేందుకు అవకాశాలెక్కువగా ఉండేరంగు కాబట్టి.

ఉదాహరణకి చిరంజీవిని తీసుకోండి... సొంత సినిమా ఫంక్షన్‌ అంటే జీన్‌ ఫేంట్‌ నల్లషర్టు వేసు కుని, మిగిలిన వారికన్నా... భిన్నంగా కనిపిస్తుండగా... మహేష్‌ బాబు ఎక్కువగా ఫంక్షన్లకి తానెక్కువగా ఇష్టపడే బ్లాక్‌టీషర్ట్టుతొ దర్శనమిస్తాడు. అనుష్క అయితే షాపింగ్‌ కెళ్తే ముందు కొనేది నలుపురంగు డ్రస్సుల నేన ట. అందుకే చిన్న ఫంక్షనైనా నలుపు చీర కట్టుకొస్తుంటా అని ఆమధ్య ఓఇంటర్వూలో చెప్పుకొచ్చింది కూడా.

ఇకవరుస విజయాలతో దూసుకు పోతున్న గోపీచంద్‌ సైతం సినీ ఫంక్షన్లలో నలుపు దుస్తులతో కనిపిస్తాడు. ఆమధ్య జరిగిన కేన్స్‌ ఫెస్టివల్‌లో నియాన్‌ కాంతుల నడుమ నల్లని దుస్తులతో మెరిసి తన స్పెషలిటీ నిరూపించుకుంది. ఇలా సెల బ్రెటీలంతా నలుపుకు ప్రాధాన్యత ఇస్తు... ఫంక్షన్లలో తన ప్రత్యేకతని నిలుపుకుం టూ వస్తున్నారు.

ఇలా ఫ్యాషన్‌ ప్రపంచంలో నలుపు తన స్దానాన్ని పదిలపరుచుకుంటూ ఎవరు? అంటూ ప్రత్యేక గుర్తింపు నివ్వటమే కాకుండా.. ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ కలర్‌ బ్లాక్‌ అంటూ... యువతరానికి ఆనందాన్ని కలుగ చేస్తోందనటంలో ఆశ్చర్యం లేదు. నలుగురిలో మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలంటే...నలుపు దుస్తుల్ని ధరించా ల్సిందే...నేడు వయసుతొ సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అంతా బ్లాక్‌లో కనిపిం చేందుకు తహతహ లాడుతున్నారు.

నేటి ప్యాషన్‌ ప్రపంచంలో కుర్రకారుని ఆకర్షిం చేందుకు అన్ని వస్త్ర కంపెనీలు నలుపు రంగు వస్త్రాలతో రూపొం దించిన అనేక రకరకాల దుస్తుల్ని మార్కెట్‌లోకి దించా యి. యువత నలుపు రంగులో ఉండే జీన్స్‌. టీషర్టులు, కురా తపైజామాలు షార్ట్‌లు కనిపిస్తుండగా... మహిళల కోసం అనేకరకాల ఎంబ్రయిడరీ డిజైన్లతో ప్రత్యే కఫ్యాషన్‌ డిజైన్లతో కూడిన చీరలు, స్కర్ట్టులు, ఫ్యాంట్లు, టైలు, కోట్లు, ఫ్రాక్స్‌ దర్శనమిస్తు న్నాయి. బ్లాక్‌కలర్‌ని స్టయిలిష్‌కి మారు పేరుగా, సెక్సీ కలర్‌గా పేరు తెచ్చుకు న్న ఈ రంగు ఇప్పుడు సగటు జీవికి కూడాఫేవరేట్‌ రంగుగా మారిపోయిందనటంలో సందేహం లదు.

నేడు వేసుకున్న దుస్తులకు

తగ్గట్టుగా

మ్యాచింగ్‌లు కూడా నలుపే కావాలని మొగ్గు చూపు తున్నారు. మెడలొ ధరించే దండలు, చెవులకు పెట్టుకునే రింగులు, డైమండ్‌తో చేయించుకున్నా... చేతి గాజులు, నడుం బెల్టు, హాంగ్‌ బ్యాగ్‌లు ఇలా ప్రతివస్తువూ నలుపు గా ఉండాలని కోరు కుంటున్నారంటే నేటి యువతరం నలుపుని ఎంత ఇష్టపడుతున్నారో ఇట్టే అర్ధం చేసుకోవ చ్చు.

నఖ శిఖపర్యంతం నలుపుతోనే తమకో ప్రత్యేకత వస్తు న్నప్పుడు ఇది అశుభమైన రంగని ఎందుకంటున్నారో అర్ధం చేసుకోలేక పోతున్నామన్నది నేటి తరం వేస్తు న్నప్రశ్న దీనికి సమాధానం మనం ఖచ్చితంగా ఇవ్వలేక పోయినా... ఇది యూనివర్శల్‌ కలర్‌ అందుకే ఫంక్షన్ల కెళ్లేప్పుడు ఎలాంటి రంగు దుస్తులు వేసుకెళ్లాలన్న కన్ఫ్యూజన్‌లో మీరుంటే నలుపు డ్రస్‌ని వేసుకొని వెళ్లండి... అది లేదంటే... నలుపు, తెలుపు కాంబి నేషన్‌ దుస్తులు వేసుకుంటే సరి అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.

భారీ డిజైన్లకన్నా సింపుల్‌గా ఉండే డిజైన్లతో కూడిన దస్తులపై మక్కువ చూపిస్తున్నవారిలో ఎక్కువగా నలుపు కాంబినేషన్‌ వైపే చూస్తుంటా రని, అయితే సిప్లిసిటీకి, డిగ్నిటీకి ప్రతీకగా నిలచే నల్లని దుస్తులు వైపు ఎక్కువ మక్కువ చూపిం చడానికి కారణాలు అన్వేషిస్తే... నలుపు ధరిస్తే సన్నగా కనిపిస్తా మన్న భావన పెరగటం ఓ కారణం కాగా బంగారం, ముత్యాలు, వజ్రాలు ఎన్ని ఉన్నా సింపుల్‌ యాక్స రీస్‌ నలుపు కి సరిగ్గా మ్యాచ్‌ కావ టం కూడా మరో కారణమని... నిపుణులు చెప్తున్నారు.

సాధారణంగా త్వరగా రంగుని కోల్పోయే లక్షణాలు న్న ఈ నలుపు రంగు దుస్తులు కొనేప్పుడు నాణ్య మైన వస్త్రాలకే ప్రాధాన్యత ఇవ్వండి. బ్లాక్‌లోదొరికే చాలా రకాల షేడ్స్‌లో మీకు నచ్చిన వాటిలో మంచి ఫ్యాబ్రిక్‌కి చూసికొనుక్కోండి. ఎలాంటి రంగుదుస్తులు న్నా... టాప్‌, బాటమ్‌ ఎక్కడైనా మ్యాచ్‌ అయ్యి మీరు వేసుకునే దుస్తులకు గుర్తింపు తెచ్చే నలుపు రంగుని మీ జీవితంలొ ఓ భాగం చేసుకోండి. ఎక్క డున్నా మీ ప్రత్యేకత నిలుపుకునేందుకు నేడే ఓ నలుపు రంగుని దుస్తుల్ని కొనుక్కోండి.

సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌

పెరుగుతున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో నలుపు కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దాదాపు నేడు జరుగుతున్న అనేక ఫంక్షన్లలో నలుపు రంగు డ్రస్‌ వేసు కొచ్చిన వారే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ గా నిలబడుతున్నారనటం అతిశయోక్తి కాదె మో? మీకెన్ని రంగు రంగుల దుస్తులున్నా... ఒక్క నలుపు డ్రస్సయినా లేకుంటే మీకు ఫ్యాషన్‌ టేస్ట్‌ తెలియదన్నా ఆశ్చర్యపోనఖ్ఖర్లే...