తెలుగు భాష మనది... నిండుగ వెలుగు జాతి మనది... అని పాటలు పాడకునే దిశ నుండి
ప్రపంచ వ్యాప్తంగా మరింత అభివృద్ధి దిశగా వేసిన అడుగులు ఫలించాయి.
అంతర్జాలంలో మన మాతృభాషలోనే భావ సందేశాలు, చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని రాసుకునేందుకు వీలుగా యునికోడ్ కాన్సిర్టియంలోకి ఎట్టకేలకు ప్రవేశించే అవకాశాన్ని దక్కించుకున్న తెలుగు భాష- ఇక విశ్వజనీతం కావటం ఖాయమని... నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే తమిళ, హిందీ, భాషలు యూనికోడ్ కాన్సిర్టియంలోకి ప్రవేశించి తమ సత్తా చాటు కోవటం ప్రారంభించాయి. తాజాగా తెలుగు భాషకు కూడా యూనికోడ్‌లో ప్రవేశం దక్కడంతో పాటు పూర్తి అధికారిక సభ్యత్వం కూడా సంపాదించుకోవటం పట్ల తెలుగు భాషాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు వివిధ సాంకేతి క సంస్ధలు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అడోబ్ సిస్టమ్స్, యాపి ల్ ఇంక, మెక్రోసాఫ్ట్ కార్పొరేషన్, ఒరాకిల్ అమెరికా, గూగుల్, ఐబి ఎం కార్పొరేషన్, ఎస్‌ఎపి తదితర ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్ధలు కూడా తమ సాఫ్ట్‌వేర్‌లని తెలుగు భాష కు మద్దతు ఇచ్చేలా రూపొం దించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి.
ఇటీవల కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ తెలుగు అంతర్జాలసమావేశంలో తెలుగు భాషకు యునికోడ్‌లో ప్రాధా న్యత లభించడంతో దీనిని ఆసరాగా తీసుకుని భాషని విస్తృత పరచాలని ఈ మేరకు అనేక ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించా రు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడేవారు 7కోట్ల పైచిలుకు కాగా, ప్రపం చ వ్యాప్తంగా వీరి సంఖ్య 18 కోట్లు ఉంటుం దని ఓ అంచనా.
తాజాగా జరిగిన నిర్ణయాలతో ఇన్నాళ్లూ ఇంగ్లీషు భాషలో ఉండి... తగు రీతిన అర్ధం కాని పరిస్ధితి నెలకొన్న చట్టాలను కానీ, ఇతర ప్రభుత్వ నిర్ణయాలను, గవర్నమెంట్ ఆర్డర్లను, టెండర్లు, ఇలా చాలా విషయాలు ఇక ముం దు తెలుగులోనే కనిపించనున్నాయి. దీంతో సామాన్యుడికి సమాచారం అర్ధమయ్యేలా రూపొందటం వల్ల వారిలో మరింత చైతన్యం వెల్లి విరిసే అవకాశాలు బోలెడున్నాయని సామాజిక వేత్తలు కూడా చెప్తున్నారు.
అలాగే అనేక మంది రచయితల రచనలు, ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక విశేషాలను యునికోడ్‌లో తెలుగు రంగ ప్రవేశం తరువాత నేరు గా మన స్వీయ భాషలోనే చదువుకునే అవకాశం ఉందని సాహితీ ప్రియులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమాచార సాంకేతిక విప్లవం దూసుకు వస్తున్న క్రమంలో ఇపðడు గ్రామ గ్రామానా ఇంట ర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే భారత ప్రభుత్వ టెలికాం సంస్ధతో పాటుగా వివిధ ప్రయివేటు టెలికాం సంస్ధలు కూడా అనేక ప్యాకేజీలు ఇచ్చి ఇంటర్నెట్‌ని విస్తృత పరచడం తో తెలుగు వెలుగులు మరింతగా విరజిమ్మేందుకు అవకాశం ఉందన్న ది వాస్తవం. యూనికోడ్ పరిధిలోకి తెలుగు భాష వచ్చి చేరడంతో... విదేశాలలో ఉండే తన బంధు మిత్రులతో తెలుగులోనే ఛాటింగ్ చేసు కుంటూ వారు మనపక్కనే ఉండి మాట్లాడుతున్నారనే భావన కలగటం ఖాయమని.. వ్యక్తి గత ఆలోచనల్ని, అక్షర రూపాల్లో వివిధ బ్లాగుల్లో ఇప్పటికే తెలుగులో వెలువరిస్తున్న రచయితలకు కూడా తాజా పరిణామాలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వటం ఖాయమని పలు వురు బ్లాగర్లు చెప్తున్నారు.
కాగా యునికోడ్ తెలుగు ఫాంట్లుపై మరిన్ని సాంకేతిక పరమైన ప్రయోగా లు జరుగుతున్న దశలో ప్రస్తుతం ఉన్న విండో స్ ఎక్సపీ ద్వారానే అన్ని భారతీయ భాషలనీ వాడుకుంటున్నట్లే... తెలుగునీ వాడుకునే అవ కాశాలున్నాయి. చాలా మందికి యాప ిల్, ఫొనిటికకీే బోర్డు మాత్రమే తెలుగు లో వాడటం అలవాటు. అయితే ఎక్సపి ఇన్ స్క్రిప్ట్ కీబోర్డుకి పని చేస్తుం ది. అలాంట పðడు కీ బోర్డు ఆప్షన్ మార్చుకోవాల నుకుంటే సీడాక సంస్ధ వెబ్ సైట్ నుండి బోర్డ్ డ్రైవ్‌లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని ఇనిస్టాల్ చేసుకుంటే మీకు నచ్చిన కీబోర్డుతో టైపింగ్ చేసుకోవచ్చు.
యునికోడ్‌లో తెలుగు భాషకు అరుదైన గౌర వం దక్కడంతో ఇక తెలుగుఃవాడఃిని చూపిం చడమే తరువాయి. ఐటి దిగ్గజాల సరసన మనం కూడా చేరి సభ్యత్వం పొందటంతో ఇంటర్నెట్‌లో తెలుగు లిప ిలో జరుగుతున్న పొరపాట్లను సవరిస్తూ... యూనికోడ్ లిపి ప్రమాణా లకు అనుగుణం గా కొత్త లిపిని రూపొందించేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేసున్నారు. అలాగే ఇందుకు గాను ఆరు ఇంటర్నెట్ ఫాంట్లను రూపొందిస్తూ... వీటన్నింటినీ ఉచితంగానే డౌన్‌లోడ్ చేసు కునే ఆస్కారం కలిపించాలని నిర్ణయించింది ప్రభుత్వం. తెలుగు భాష టైప్ చేసేపð డు వచ్చే తపðలను దిద్దేందు కువీలుగా ప్రత్యేకంగా ఓ స్పెల్ చెక సాఫ్ట్‌వేర్‌ని కూడా రూపొందించే పనిలో పడ్డాయి
మరికొన్ని సంస్ధలు. అలాగే ఇపðడు అంతా వాడుతున్న వివిధ కీ బోర్డులకు అనుగుణంగానే యూనికోడ్‌లో తెలుగును శాశ్వత ప్రమా ణాలతో రూపొందించాలని తెలుగు భాషపై మక్కువ ఉన్న అనేక మంది విదేశాలలో ఉన్న సాంకేతిక నిపుణులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని అనేక ప్రయోగాలకు నడుం బిగించారు. మరోవైపు తెలుగు భాషలో ఉన్న వివిధ రకాల వెబ్ సైట్లనుఒకే వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా ఓ బ్రౌజర్‌ని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలను ముమ్మ రం చేసింది. ఏది ఏమైనా... మన భాషని విస్తృత పరిచే క్రమంతో అంతర్జాలంలో ప్రత్యేక స్ధానం దక్కించుకుంటూ వస్తున్న సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ... దూసుకు పోవాలని మనమూ ఆశిద్దాం...