నిన్నటి వరకు గిర గిర తిరిగే కుమ్మరి చక్రం నేడు ఆగి పోయింది.
నాగరికత నేర్చాక తన చేతి వేళ్లతోనే సొగసులద్దుతూ... ప్రకృతిలోని మట్టికే ప్రాణ ప్రతిష్ట చేస్తూ...
ఈ జగానికి భోజన కంచం, మంచినీళ ్ల్లగ్లాసు, వంట పాత్రలని తయారు చేసిన చెయ్యి...
నేడు సాయం కోసం అర్ధిస్తోంది. దీపావళికి ప్రతి ఇంటా కాంతులు వెద జల్లే దీపాలకు ప్రమిదలనందించి పరమానందభరితుడైన ఈ సమాజ నేస్తం నేడు తన ఇంట్లో మిణుకుమంటున్న దీపం ఆగిపోకూడదని, తరతరాలుగా వస్తున్న ఈ కళ తనతోనే అంతరించి పోకూడదని కోరుకుంటున్నాడు.
దీపావళి అనగానే అందరి మదిలో ఏదో తెలియని ఆనందమే... చిచ్చుబుడ్లు మతాబులే కాదు వెలుగులు విరజిమ్మే దీపాలకే దీపావళి రోజున ప్రత్యేక స్ధానం ఉంది. ఎంత పేదవాడైనా ఆ రోజున ఖచ్చితంగా తన ఇంటి ముందు చిన్న పాటి దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో అలౌకిక ఆనందాన్ని పొందుతాడన్నది వాస్తవం.
దిబ్బి దిబ్బి దీపావళి.. మళ్లీ వచ్చే నాగులు చవితి అంటూ దీపావళి నాడు సాయంత్రం వేళల్లో ఆముదపు కర్రకు, గోగునార కర్రలకు చిగుళ్లలో దూదెను కట్టి వెలిగించి నేలకు కొట్లడంతో దీపావళి ప్రక్రియ ప్రారంభమవుతుంది. దక్షిణ వైపు నుండి ముందుగా దీపా న్ని వెలిగించడం హిందూ సాంప్రదాయాలలో ఒకటిగా వస్తోంది. ఇలా దీపం వెలిగించడాన్ని ఉల్కాదానంగా పేర్కొంటారు. ఇది పితృదేవతలకు దారి చూపుతుందని ఓ నమ్మకం. ఈ దీపం వెలిగించా క ఇంట్లో నువ్వెల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ముందుగా ఆ దీపపు లకి్ఝకి నమస్కరించి...లకి్ఝపూజకి ఉపక్రమిస్తా రు. కలశంపై లకి్ఝదేవిని ఆవాహన చేసి లకి్ఝ పూజ అనంతరం దీపాలను ఇంటి ముందు వరుసగా పెట్టి బాణా సంచా కాల్చేందుకు సిద్దమవుతారు. అంటే మట్టి దీపాలను దేవతా మూర్తులుగా ప్రాధాన్యత ఇచ్చిన సాంప్రదా యం మనది.
ఒకపðడు దీప కాంతుల కోసం విరివిగా మట్టి ప్రమిదలనే ఉపయోగించేవారు. కానీ మారు తున్న కాలం తో అనేక మంది డిజైనర్లు తమ చేతి కి పనికలిపించి అనేక రకాల డిజైన్లు రూపొందించ డంతో వేలాది డిజైన్ల ప్రమిదలు బోలెడు లభ్యం కావ టం ప్రారంభమయ్యాయి. సాధారణ ప్రమిదలకన్నా... రంగులతో హొయలొలికించేలా రూపొందిన ఈ ప్రమిదలు అందర్నీ ఆకర్షించడంతో వీటి ప్రాముఖ్యత క్రమంగా పెరగటం ప్రారం భించింది.
ఈ క్రమంలో దీపావళికి పూజించే లకి్ఝ దేవి ఆకృతి ఉన్న దీపాల ప్రమిదలతో పాటు శిపార్వతులు, వినాయ కుడు ఇలా అనేక దేవతా స్వరూపాలు ప్రమిదలకు వచ్చి చేరాయి. ఒక దానిని మించి మరొకటి రూపొందించిన ఈ దీపపు ప్రమిదలు సాంప్ర దాయాలకు అనుగుణంగా ఉండటంతో పాటు చూడగనే ఆకర్షించేలా ఓ ప్రత్యేకత సంతరిం చుకునేలా ఉండటం వల్ల వాటివైపు ఎక్కువమం ది మక్కువ చూపారనే చెప్పాలి. దీపావళి జీవితం లో వెలుగు నింపే పండగగా పేరు. దీపావళికి వాడే ప్రమిదల్లో అనేక హొయలుతో రావటంతో మన స్ధానిక సాంప్రదాయ కుమ్మర్ల నోట మట్టి పడిందనే చెప్ప క తప్పదు. తరతరాలుగా మట్టినే నమ్ముకుని జీవిస్తున్న అనేక కుంటుంబాలు సమస్త మాన వాళికి కావాల్సిన అనేక రకాల పాత్రల తయారు చేసి అంద చేసేవారు. అయితే రాను రాను లోహపు పాత్రలు, స్టీల్ వాడకం పెరిగాక మట్టి కుండల్లో వంట చేసుకునే ప్రక్రియ దాదాపుగా అంతరించి పోయింది. మట్టి కుండల స్ధానంలో ప్లాస్టిక బిందెలు, వచ్చి చేరాయి. మట్టి కుండల్లో నీరు శ్రేష్టమని తెలిసినా దాని చల్లదనం ఆరోగ్యా న్నిస్తుందని తెలిసినా అంతా ఫ్రిజ్‌ల మీదే ఆధార పడి అనవసర రోగాలు కొనితెచ్చుకుంటుం డంతో తనది అక్కరకి రాని వృత్తిగా మారిపోయిం దన్న తపన పడుతున్న కుమ్మరులెందరో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒకపðడు సారెపై అనేక ఆకృతులు రూపొందించి సమాజంలో తలలో నాలుకగా వ్యవహరించిన కుమ్మరి బ్రతుకు నేడు ఛిన్నాభిన్నమైపోయిం ది. అయినప్పటికే నేటికీ చాలా కుటుంబాలలో నిన్నటి తరంకి చెందిన వారు సారెతిపðతూ ప్రమిదలనైనా చేసి ఇచ్చేందుకు తాపత్రయ పడు తున్నారంటే అంతరించి పోతున్న కళని భావితరాలకు మచ్చుకైనా చూపించాలన్న తపనే కారణం.
కడుపు నింపని కులవృత్తి
కులవృత్తికి సాటి రావు గవ్వల చెన్నా... అంటూ నాడు కుల వృత్తులనుగౌరవించి.. భావితరా లకు అందించాలని తత్వవేత్త లు రాసినా ఇపðడా కుల వృత్తులు తమకు కనీసం కూడా పెట్టడం లేదన్న ఆవేదన చాలా మంది కుమ్మరి పని వారిలో ఉంది. ఏడాదిలో
కనీసం మూడునెలలు కూడా సరైన పని ఉండటం లేదని.. ప్రపంచమంతా ప్లాస్టిక మయమైపోవటంతో తమ పొట్టని నింపు కునేందుకు తమ వారసులు వేరే వృత్తులవైపు మళ్లుతున్నారని... దీంతో తమ వృత్తి మూల పడిపోతోం దని ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి తమ లోనూ ఎందరో నైపుణ్యం ఉన్న వారు ఉన్నా సరైన శిక్షణ, ప్రోత్సాహం కరువవుతుండటం వల్లే జీవనోపాది ్థకోసం వేరే మార్గాలను పట్టాల్సి వస్తోందని, తరతరాలుగా వస్తున్న ఈ వృత్తిని అంతరించుకొనిపోకుండా చూసుకునేం దుకు తామే నడుంబిగించి చేసిన మట్టి పాత్రల్ని అమ్మ కాలు జరిపేందుకు తిరుగుతున్నా సరైన ఆదరణ లభించ ట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు.
దూసుకు పోతున్న రాజస్ధాన్ ప్రమిదలు
ఇక కొల్‌కత్తా, రాజస్ధానీ కళాకారులు రూపొందించిన దీపాల ప్రమిదల అందాలు ఇట్టే కట్టిపడేస్తుండటంతో క్రమంగా అటువైపు మక్కువ చూపేవారు ఎక్కువవుతున్నారు. నగరా లతో పాటు చిన్న తరహా పట్టణా లలోనూ ఇపð డు ఈ ప్రమిదల అమ్మకం జోరందుకుంది. వివి ధ రంగులతో, అనేక రకాల డిజైన్లతో, కొత్త తర హాలూ రూపొందించిన ఈ ప్రమిదలు విభిన్న ఆకృతుల్లో, కళ్లు చెదిరేలా రూపొందించటంలో ఆయా రాష్ట్రాల కళాకారులు తమ నైపుణ్యం చాలానే ప్రదర్శిస్తూ.. దూసుకు పోతున్నారనే చెప్పక తప్పదు.
పొట్ట కొడుతున్న ప్లాస్టిక ప్రమిదలు...
కనీసం దీపావళికైనా పట్టెడన్నం తింటామని భావించిన సగటు కుమ్మరి కుటుంబాన్ని ఇప్పటికే రాజస్ధానీ , గుజరాత్, కోల్‌కత్తా ప్రమిదలు నోటి కాడ కూడుని లాగేస్తుంటే... మరోవైపు ప్లాస్టిక దీపాలు కూడా ఉన్న దాన్ని ఊడగొడుతోంది. చుక్కల నంటిన ధరలు కిందకి దిగి రాక పోవటంతో ఓనాడు ఘనంగా జరుపు కున్న దీపావళిని నేడు ఉన్నంతలో తూతూ మంత్రంగా జరిపేసుకునేందుకు ఏనాడో మానసికంగా సిద్ద మైన సగటు మనిషికి దీపాల ఆకృతిలో ఉన్న విద్యుత్ దీపాలు ఊరట నిచ్చాయనే చెప్పక తప్పదు.
కార్పొరేట్ దెబ్బ :
ఇప్పటికే పలు రకాలుగా తమ ప్రమిదలు వాడకం తగ్గిపోవటంతో తమ జీవన గమనమే మారి పోయిం దని...వీటికి తోడు మార్కెటింగ్ రంగంలో ప్రవేశించిన అనేక కార్పొరేట్ కంపెనీలు తమ ఔట్‌లెట్లలో అనేక రకాల కొవ్వెత్తులతో పాటు దీపపు ప్రమిదల కొవ్వెత్తులు కూడా అమ్మకాలు జరుపుతుండటంతో సాధారణ ప్రజలు కూడా తమవైపు చూడటం మానేసారన్నది కుమ్మరి కళాకారుల ఆవేదన.
మనమేం చేయాలి :
తరతరాలుగా సమాజానికి సేవలందిస్తూ... మట్టినే నమ్ముకుని జీవిస్తున్న కుమ్మరి కుల వృత్తుల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో సగటు మనిషిగా మనకీ అంతే ఉంది. కనీసం ఈ దీపావళికైనా మీ ఊర్లో కుమ్మరి తయారు చేసిన ప్రమిదలు కొనండి. వాటికి మీరే రక రకాల రంగు లేసు కుని మీకు నచ్చినట్లు అలంకరించుకోండి. ఇందుకు పూసల దండలు, కుందన్‌లు, స్టిక్కర్లు, లేస్‌లు ఇలా ఇంట్లో మీకు అందుబాటులో ఉండే వాటితోనే అలంకరించుకుంటే... బాగుంటుంది ఓసారి ఆలోచించండి.
కుల వృత్తికి గుడ్ బై
నా చిన్నప్పటి నుండి ఈ వృత్తినే నమ్ము కుని కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు నాన్న. రోజంతా కష్టపడ్డా కనీసం కూలి కూడా వచ్చే అస్కారం లేకపోవటం, ఏరోజు బతుకు ఆరోజే అన్న చందంగా మారటంతో ఒకపðడు ఆనందంగా బతికిన మా కుటుంబం మట్టి వస్తువులు వాడకం తగ్గుముఖం పట్టాక చెల్లా చెదురైపోయింది. అందుకే కుల వృత్తికి గుడ్ బై చెప్పేసి నేనో ప్రయివేటు కంపెనీలో చేరి పోయా... -కానుగుల పరశురాం, గౌతమ్ నగర్, సిికింద్రాబాద్
ఆదాయం అంతంతే...
నేటికి మా ఇంట్లో అడపా దడపా పెళ్లిలకు కావాల్సిన కుండ లను, మట్టి పాత్రలని అమ్ముతాం. అయితే వాటిపై వచ్చే ఆదాయం అంతంత మాత్రమే.. అందుకే అమ్మతో ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టించా...నేనే సొంతంగా మరో వ్యాపా రం ప్రారంభించుకున్నా... కులవృత్తిని పక్కకు పెట్టడం కాస్త బాధాకరమైనదే... దాన్ని తగ్గించు కోవటానికే వినాయక చవితి, పండగల్లో మట్టితో చేసే విగ్రహాలను, ప్రమిదలను అమ్ముతున్నాం.
- ఇ.రాజు, దయానంద నగర్, మల్కజ్‌గిరి.
ఎంత కష్టపడ్డా ఫలితం సున్నా...
వయసుడుగుతున్నా...నిమిషానికో ఓ ప్రమిదని, పని నిమి షాలకో కుండని చేయగలను నేటికీ.. అన్నీ చేసి వాటిని ఎండ బెట్టి కాల్చి.. విరిగినవి పోగా మిగిలినవి మార్కెట్‌కి తీసుకుపోతే కొనేవారే కరువవుతున్నారు. దీపావళి కోసం ప్రమిదలు తయారుచేస్తున్నా... రోజంతా కష్టపడ్డా ఫలితం నిండు సున్నా... బజార్లోకి వచ్చిన అనేక రకాల ప్రమిదల ముందు మా ప్రమిదలు విల విల లాడుతున్నాయి. మిషన్లని ఉపయోగిస్తూ... పోత తరహాలో రాజస్ధాన్, కలకత్తా వాళ్లు మాలా సారె తిప్పకుండానే ప్రమిదలు చేసి పడేస్తున్నారు. రంగుల వాడుతు.. పింగాణీ దీపాల్ని పోలి ఉండటంతో అంతా అటువైపే మళ్లు తుండటం తో మమ్మల్ని పట్టించుకోవట్లేదు
-నరసింహ, కుమ్మరి, నరసింహ నగర్, మల్కజ్‌గిరి.