భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి అస్సాం యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. గంగూలీతోపాటు మరో ముగ్గురికి కూడా డాక్టరేట్‌ను అందచేశారు. డాక్టరేట్ అందుకున్న వారిలో ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ఇర్ఫాన్ హబీబ్, కళాకారుడు ప్రోఫెసర్ కేజీ సుబ్రమణ్యం, అస్సాం సాహిత్యకారుడు, జర్నలిస్ట్ హోమెన్ బోర్గోహెయిన్‌లున్నారు.