'మహా మహా...'అంటూ 'మంత్ర'లో రేపిన వేడి సెగలను ఇప్పుడు 'ఐస్ ఐస్...' అంటూ 'మంగళ'లో చల్లార్చుతున్న చార్మీకి 'రగడ'లో నాగార్జున పాటతో మంచి గిరాకీలు వచ్చి పడుతున్నాయి. ఒక పక్క హీరోయిన్ వేషాలను ట్రై చేస్తూనే మరో పక్క ఐటెం పాటల్లో రెచ్చిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
కత్తిలాంటి ఫిజిక్ అంటూ నాగార్జున ఇచ్చిన కాంప్లిమెంట్స్ చార్మిలో ధైర్యాన్ని నింపాయి కాబోలు ఏకంగా పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'లో ఐటెం పాట కోసం లాబియింగ్ మొదలెట్టింది. హిందీ మాతృక 'దబంగ్'లో 'మున్ని బద్నాం' పాటకు దేవిశ్రీ ప్రసాద్ తెలుగు ట్యూన్ కడుతుంటే, మలైకా అరోరా ఖాన్ స్టెప్పులను చార్మీ నిశితంగా పరిశీలిస్తూ పవన్ కళ్యాన్ని పడగొట్టే పనిలో ఉంది. పవర్ స్టార్ పక్కన నర్తించే అవకాశం దొరికితే అదృష్టం తలుపులు తీసినట్టేనని చార్మీ అప్పుడే తన పాత ప్రియుడు దేవికి బ్రోకర్ పనులు అప్పజెప్పిందట.
తుపాకీ నుంచి