1, ఫిబ్రవరి 2011, మంగళవారం

కోర్టులో జడ్జీలకు మల్లికా షెరావత్ డ్యాన్స్ నచ్చింది

మల్లికా షెరావత్ పేరు వింటేనే తుల్లిపోయే కుర్రకారుకి పోటీగా ముసలివాళ్ళు కూడా తోడయ్యారు. సరిగ్గా అయిదేళ్ళ క్రితం ఓ అయిదు నక్షత్రాల హోటల్లో మల్లికా చేసిన రికార్డింగ్ డ్యాన్సు సంచలనం అయ్యింది. వినోద్ జైన్ అనే సంఘ సంస్కర్త అటెండ్ అయిన ఈ పార్టీలో మల్లికా చేసిన డ్యాన్సు ఆయనకు నచ్చలేదు. ఇంతటి అసభ్యకరమైన డ్యాన్సు తన జీవితంలో చూడలేదని, ఇదే డ్యాన్సులని సెన్సార్ లేకుండా టీవీల్లో ప్రసారం చేయడం మరింత దారుణమని కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసాడు.

అయిదేళ్ళు కోర్టులో కేసు నడిచి, ముసలి జడ్జీలు పదేపదే అదే వీడియోను వందల వేల సార్లు చూసేసరికి మల్లికా ఫ్యాన్స్ అయిపోయారు. అందుకే మల్లికా చేసిన నృత్యంలో ఏ మాత్రం అశ్లీలత లేదని తమ విచారణలో తేలినట్టు ఓ జడ్జిమెంటు ఇచ్చేసారు. వినోద్ మాత్రం జడ్జీలకు ఈమె రికార్డింగ్ డ్యాన్సులు నచ్చాయేమో కానీ మల్లికాను వదిలేది లేదు అంటూ వీడియోను హై కోర్టు న్యాయముర్తులకు చూపిస్తానంటూ ముంబై హై కోర్టులో మళ్ళీ ఓ పిటీషన్ దాఖలు చేసాడు.



తుపాకీ నుంచి