1, ఫిబ్రవరి 2011, మంగళవారం

పదవుల కోసమే పీఅర్పీని కాంగ్రెస్‌కు తాకట్టు

పదవుల కోసమే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టినట్లుందని మాజీ ఎంపీ హరిరామజోగయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజలకు వివరణ ఇచ్చాకే చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి హరిరామజోగయ్య ఓ లేఖను సంధించారు.