6, ఫిబ్రవరి 2011, ఆదివారం

'రాజ్యం' ఇక హస్తగత0

అంతా అనుకున్నట్టే అయ్యింది. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేయటం జరిగింది. పార్టీ పెట్టి మూడేళ్లు కాకముందే..రాజకీయపార్టీని నడపడ మంటే సినిమాలో నటించి పారేయటం కాదన్న నిజాన్ని తెలుసుకోవటంతో పాటు ఈ వ్యాపారంకి పెట్టుబడి దండగ దుఖాణం మూసేద్దాం అన్న బామ్మర్ధి సలహా సూచనల మేరకు ఆదివారం ఆపసోపాలు పడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి పిలుపుకోసం ఎదురు చూపులు చూసి..చివరికి ఇన్నాళ్లూ భారంగా నెడుతున్న బరువు బాధ్యతల్ని దించేసుకుని తన 'రాజ్యం' ఇక హస్తగతమని హాయిగా ప్రకటించేసారు.
అట్టహాసంగా ప్రారంభించి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి.. జనం మీదకు కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా ప్రచారానికి వచ్చి పడ్డా...ఓట్లు పడలేదు. సరికదా సొంత ఊర్లోనే నమ్మని ఓ మహిళామణి చేతిలో చిత్తుగా ఓడించి పంపారు ... చావుతప్పి కన్నులొట్టబోయినట్లు తిరుపతిలో గెలిచారు. కేవలం 18 సీట్లకే పరిమితమైన తరుణంలో రాజావారి లేఖలు, కేవీపీ మంతనాలు,ఉండవల్లి తపాలా పనులు... ఇలా సాగిన వైనాన్ని పత్రికలు ఆ నేడే 'జండా పీకేద్దాం' అంటూ చిరు మనసులోని మాటని బైటపెట్టిన సంగతులు..వాటిపై విరుచుకు పడిన నేతలు గమ నించాలి.వైఎస్‌ ఉన్నపðడే కాంగ్రెస్‌లోకి పోవాలన్న కదనోత్సాహం చూపి ఆమేరకు స్క్రీన్‌ప్లే కూడా రచించేసారని.. దాన్ని తమలాంటి వాళ్ల అడ్డుకున్నామనది చిరుకి రాజకీయ ఓనామాలు చెప్పిన చేగొండి విప్పిన గుట్టు  గుర్తెరగాల్సిందే.