రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా 'విలీనాల' ట్రెండ్ నడుస్తోంది. డెబ్బవ దశకంలోనే రాష్ట్రంలో పార్టీల విలీనాలు జరిగాయి.
1969లో తెలంగాణ సాధన కోసం మర్రి చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్)ను ఏర్పాటు చేసి.. 1971 ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లలో పోటీచేసి 10 స్థానాలను గెలుచుకుని.. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికే కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
1978లో 'రెడ్డి కాంగ్రెస్' పేరుతో బ్రహ్మనందరెడ్డి పార్టీని ఏర్పాటు చేసి . అప్పట్లో జరిగిన ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నారు.. . రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కూడా ఉన్నారు. 1980లో ఈ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.
1978లో ఎన్ టి ఆర్ ప్రభుత్వాన్ని కులదోసేందుకు కుయక్తులు పన్ని.. నాదెండ్ల ని వినియోగించుకొన్న క్రమంలో పుట్టుకొచ్చిన ప్రజాస్వామ్య తెలుగు దేశం చివరికి కాంగ్రెస్ లో విలీనమైంది.
సినీ నటీ విజయశాంతి 'తల్లి తెలంగాణ' పేరుతో పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ సాధన లక్ష్యంతో ముందుకు సాగుతున్న టిఆర్ఎస్‌లో విలీనం చేశారు.
ఇదే క్రమంలో 2009 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి 'నవ తెలంగాణ పార్టీ'ని ఏర్పాటు చేసిన సీనియర్ నేత టి.దేవేందర్‌గౌడ్ ఎన్నికల అనంతరం తన పార్టీని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)లో విలీనం చేశారు. ఆపై ఇప్పుడు దేశంలోనే చేరి కుస్తీలు పడుతున్నారు.
తాజాగా 18 మంది ఎమ్మెల్యేలు కలిగిన చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) కాంగ్రెస్‌లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది.
ఇవికాక ఖాతాలే తెరుచుకొని పార్టిలు బోలెడు కాంగ్రెస్స్ బాటలోనే ఎక్కువగా పయనించాయ న్నదే. గమనార్హం