తత్కాల్ కోటా రైలు ప్రయాణికులు ఇక నుంచి తమతో పాటు గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. తత్కాల్ పథకంలో చోటు చేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రయాణ సమయంలో గుర్తింపుకార్డు కలిగి ఉండాలనే నిబంధన చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
తత్కాల్ టికెట్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నప్పుడు వారిలో ఒక్కరైనా పైన పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది. అలా చూపించని పక్షంలో వారిని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణిస్తారు. ప్రయాణికులు ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు, విద్యార్థులైతే కళాశాల గుర్తింపు కార్డు, జాతీయ బ్యాంకులు జారీ చేసిన పాస్‌బుక్కు, లామినేషన్ చేసిన ఫొటోతో కూడిన క్రెడిట్ కార్డులలో ఏదేని ఒక గుర్తింపు కార్డును తప్పని సరిగా చూపించాల్సి ఉంటుంది.