ాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీపై, ఆ పార్టీ అధినేత చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఆదివారం ప్రజాస్వామ్యంలో చీకటి రోజని అభివర్ణించింది. కాంగ్రెస్ అవినీతిలో వాటాలకోసమే 'ప్రేమే మార్గం... సేవే లక్ష్యం' అంటూ ప్రగల్భాలు పలికిన చిరంజీవి 'విలీనమే మార్గం... పదవే లక్ష్యం' దిశగా పయనించారని మండిపడ్డారు.
గత ఎన్నికలలో ప్రజలను నమ్మించి 17 శాతం ఓట్లను, 18 సీట్లను సాధించిన చిరంజీవి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని, కాంగ్రెస్‌లో విలీనం చేసేముందు ప్రజాభిప్రాయాన్ని కోరలేదని అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్‌లో విలీనం కావడమంటే అవినీతిని పూర్తిగా సమర్ధించడమేనని నాగం జనార్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.