6, ఫిబ్రవరి 2011, ఆదివారం

సినిమా వల్ల నుంచి అధికారం లాక్కొందాం

రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి పాలిస్తున్న సినీ రంగానికి చెందిన వాళ్ల నుంచి అధికారాన్ని లాక్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వన్నియర్‌పైనా ఉందని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంక్‌గా వన్నియర్ సామాజిక వర్గం ఉందని ... వన్నియర్లు ఐక్యంగా లేకపోవడం వల్ల అధికారాన్ని ఇతర సామాజిక వర్గాల వారు తన్నుకుపోతున్నారని అన్నారు

43 ఏళ్లుగా రాష్ట్రం సినీ రంగానికి చెందిన వాళ్ల చేతిలోనే ఉంటోంద ని పరోక్షంగా ముఖ్యమంత్రి కరుణానిధి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై విమర్శలు కురిపించారు. వారి దోపిడీ నుంచి రాష్ట్రా న్ని బయటపడేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే పోటీ చేసిన స్థానాలతో పాటు అదనంగా మరికొన్ని నియోజకవర్గాలను కోరబోతున్నామని, ఎవరైతే ఆ మేరకు సీట్లు ఇవ్వడానికి అంగీకరిస్తారో ఆ కూటమిలో చేరతామన, పార్టీలోని సభ్యుల అభిప్రాయం తీసుకున్న తర్వా తే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.