6, ఫిబ్రవరి 2011, ఆదివారం

చేతిలో చేయి వేసుకొని మాట్లాడినా..‘గే’(గో)లే ....

సాధారణ స్ర్తీపురుష జంటల మాదిరిగా మాకూ డేటింగ్ చేసే ప్రదేశాలు కావాలని స్వలింగ సంపర్కులు కోరుకుంటున్నారు. కోర్టు స్వేచ్ఛను ప్రసాదించినా.. ప్రజలు ఇప్పటికీ తమను నేరస్తులుగా చూస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముంబై కేంద్రంగా హమ్‌సఫర్ ట్రస్ట్ నడుపుతూ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడే సినిమా రూపకర్త శ్రీధర్ రంగాయన్ మాట్లాడుతూ ‘మెట్రో నగరాల్లో ఇద్దరు పురుషులు కౌగిలించుకున్నా.. చేతిలో చేయి వేసుకొని మాట్లాడినా చుట్టుపక్కల వారు దానిని నేరంగా చూస్తున్నారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో మాదిరిగా ఇక్కడ మేం ఆనందంగా గడిపే తావు దొరకడం లేదు. అందుకే స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్న వాళ్లు టాయిలెట్లు, ట్రయల్ రూముల్లోకి వెళ్లడానికి కూడా ధైర్యం చేస్తున్నారు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పోలీసులు వేధిస్తున్నారు’ అని వివరించారు.