6, ఫిబ్రవరి 2011, ఆదివారం

ఇక ఆధార్ ఒక్కటే ఆధారం.

మనం బ్యాంకు ఖాతా తెరవాలన్నా లేదా ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా మొదట అడిగిదే గుర్తింపు కార్డ్ . పాస్‌పో ర్టు కు దరఖాస్తు చేసుకోవాలన్నా వ్యక్తిగత సమాచారం అడుగుతారు. కుటుంబ సభ్యుల వివరాలూ చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో సరైన గుర్తింపు కార్డు లేక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇకపై ఏ భారతీయుడూ గుర్తింపులేని వ్యక్తిగా ఉండకుండా ప్రభుత్వం ఆధార్ కార్డ్ మంజూరు చేస్తోంది. ఈ కార్‌‌డను ఇప్పుడు పొందలేకపోతే భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లవుతుంది. ప్రతి భారత నివాసికి ప్రభుత్వం 12 అంకెలతో ఒక గుర్తింపు ఇస్తూ మన జీవితాలకు భరోసా ఇస్తోంది. భవిష్యత్తులో బ్యాంకు రుణాలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలను, ప్రయోజనాలను పొందాలన్నా, రేషన్ కార్‌‌డ, లేదా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డ్ ఒక్కటే ఆధారం.

పేరు, పుట్టిన తేది, లింగ విభేదము, చిరునామ వివరాలతోపాటు బయో మెట్రిక్ వివరాలు, వ్యక్తి ముఖచిత్రం, రెండు చేతులకు సంబంధించిన పది వేళ్ల ముద్రలు (4.4.2 విధానంతో) స్కాన్ చేస్తారు. అదేవిధంగా రెండు కళ్లను ఐరిష్ (కుపాప చుట్టూ ఉండే వలయం) చిత్రాలు సేకరించి వాటిని ఆధార్ కార్‌‌డలో పొందుపరచి అందజేస్తారు. ఆధార్ కార్‌‌డ కోసం ప్రతిపట్టణం, గ్రామంలోని ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన ఆధార్‌కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ప్రతి రేషన్‌షాపు డీలర్ వద్ద ఆధార్ దరఖాస్తు ఫారం లభిస్తుంది.