ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు... ముఖ్యంగా అధికారపార్టీవారికి అడ్డగోలుగా దర్శనాలు కల్పిస్తు... ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఏడాదికోసారి దర్శనం, గోడ పై నుంచి విమాన వెంకటేశ్వరుడి దర్శనం అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈఓ ఐ.వై.ఆర్.కృష్ణారావు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీతో పాటు మరో తొమ్మిది ఆలయాలను పరిరక్షణ విషయంలో చేతకాకపోతే ఈఓ, చైర్మన్ పక్కకు తప్పుకోవాలని.. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించే బదులు... కేంద్ర నుంచి పురావస్తు శాఖ అధికారులను డిప్యుటేషన్‌పై రప్పించి ఆలయ పరిరక్షణకు నియమించాలని సూచించారు.