గయానా అధ్యక్షుడు భారత్ జెట్టీయో పుట్టపర్తి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రత్యేక భద్రత నడుమ కాన్వాయ్‌లో బెంగళూర్ నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం శాంతి భవన్‌లో అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాసేపు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిబాబాను ప్రత్యేకంగా దర్శించుకున్నారు