డైలాగ్ డెలివరీతో ప్రత్యేకత, అభినయంలో విలక్షణత చూపి నటుడిగా ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నారు నూతన్
ప్రసాద్. నూతన్ ప్రసాద్ అనగానే - నూటొక్క జిల్లాల అందగాడు, నిత్యపెళ్లికొడుకు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో వుంది, కొత్త దేవుడు ఇలా చాలా గుర్తొస్తాయి.
రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడై, 'నీడలేని ఆడది' చిత్రంతో సినీ రంగంలోకి అడిగిడినా 'అందాల రాముడు' తో ప్రేక్షకులకు ముందు పరిచయమయ్యారు. నూతన్ ప్రసాద్ కామేడియన్‌గా, కామెడీ విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభ చూపారు 475 చిత్రాల్లో. ''ఇది వరకు 'నూటొక్క జిల్లాల అందగాడు'ని ఇప్పుడు 'నూటొక్క జిల్లాల అవిటివాణ్ణి' కదండీ నేను'' అని 1989 ఏప్రిల్ నెలలో (ఫిబ్రవరి నెలలో బామ్మమాట బంగారు బాట చిత్రంలో నటిస్తూ కారు ప్రమాదంలో చిక్కుకుని మద్రాసు విజయా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా) అని తన మీద తనే సెటైర్లు వేసుకున్నారు. అప్పటి వరకు అవసరం వున్నా లేకపోయినా రాసుకు పూసుకు తిరిగిన అనేక మంది చికిత్సా కాలంలో అతి తక్కువ సంఖ్యలో వస్తుంటే నిరాశ నిస్పృహకు లోనై వేదాంత ధోరణి అలవర్చుకున్నారు. చికిత్స తర్వాత వీల్ చెయిర్‌కి పరిమితమై, మానసిక స్థైర్యం పెంచుకుని 20 ఏళ్ళపాటు అలా 110 చిత్రాల్లో నటించారు. యాక్సిడెంట్‌కి ముందు 365 చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో, టెలివిజన్ కార్యక్రమాల్లో తన మాట విరుపు వినబడేలా చేసారు. నూతన ప్రసాద్ జయంతి డిసెంబర్ 12.