ప్రముఖ యువ హీరో మహేష్‌బాబు ఇంటిపై ఆదాయపు
పన్ను శాఖ అధికా రులు గురువారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. 8 మందితో
కూడిన అధికారుల బృందం ఆయన ఇంట్లో అణువణువునా సోదా చేశారు. మహేష్‌బాబు
నటించిన దూకుడు సినిమా విజయవంతం కావడం తో భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చా
యన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటి శాఖ అధికారులు ఈ దాడి నిర్వహించారు.
అలాగే, థమ్సప్, నవరతన్ ఆయిల్, యూనివర్సల్, జోస్ అలుకాస్ తదితర భారీ
సంస్థలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మహే ష్‌బాబు ఆదాయం
గణనీయంగా పెరిగి నందున తమ శాఖ సమర్పించిన రిటర్న్స్‌కు ఆయన ఇంట్లో ఉన్న
డాక్యు మెంట్లకు పోల్చుకునేందుకు ఈ దాడులు దోహదపడతాయని ఐటి శాఖ అధికారులు
భావిస్తున్నారు. నగదు, బంగారు ఆభర ణాలు, ఆస్తులకు సంబంధించిన కొన్ని
డాక్యుమెంట్లను ఐటి అధికారులు తమ శోధనలో రికార్డు చేసుకున్నట్టు తెలిసింది.
ఐటి దాడి జరుగుతున్న విషయం తెలుసుకొని షూటింగ్‌లో ఉన్న మహేష్‌బాబు
హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు.