9, డిసెంబర్ 2011, శుక్రవారం

మళ్లి తెలుగులో గ్రేసిసింగ్‌

అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు''. అంటూ 'తప్పుచేసి పప్పుకూడు' చిత్రంలో మెరిసిన ముంబాయి భామ గ్రేసిసింగ్‌ మరో మారు తెలుగు చిత్రాల్లో కనిపించనుంది. బాలీవుడ్‌ సినిమా 'లగాన్‌'తో ఖ్యాతిగాంచిన గ్రేసిసింగ్‌ ఆవెంటనే తెలుగులో నాగార్జునతో 'సంతోషం'లో నటించింది. ఈ చిత్రం కమర్షియల్‌ బ్రేక్‌ ఇచ్చినప్పటికీ, బాలీవుడ్‌ సినిమాలపైనే దృష్టినిలిపింది. అయితే ఎందరో నాయికలు ముంబాయి నుండి వచ్చి తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మంచి పాత్రలు, అంతకుమించి పారితోషికం వంటివి ఇప్పుడు బాలీవుడ్‌ నాయికలను తెగ ఆకర్షిస్తున్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు గ్రేసిసింగ్‌ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించగా, తన పాత హీరోలు నాగార్జున, మోహన్‌బాబు ఫ్రెండ్లీ ఆహ్వానం పలికినట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రేసి రెండు చిత్రాలు అంగీకరించిందట. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.