అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక భారతీయ
మహిళను తమ పాలకవర్గంలో కీలక పదవిలో నియమించారు. ప్రీతి డి బన్సాల్ అనే ఈ
మహిళ ను ప్రభుత్వ కార్యకలాపా లలో సమర్థత, తగిన పనితీరు, నిష్పా క్షికత వంటి
వాటిని పెంపొం దించేందుకు కృషి చేసే ఒక స్వతంత్ర సంస్థ సభ్యునిగా నియ
మించారు. 'ఇటువంటి ప్రభావాత్మక వ్యక్తులను ఈ ముఖ్య పదవులకు
నియమిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. అంతేకాక వారు తమ గణనీయమైన
నైపుణ్యాలను మాకు అందజేసేందుకు అంగీకరించినందుకు కృత జ్ఞడనై ఉంటాన'ని ఆయన
అమెరికా అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్సుకు సంబంధించిన సలహా మండలి ఇద్దరు
సభ్యులను పరిచయం చేస్తూ పేర్కొన్నారు. ఒబామా పాలకవర్గం లో ఉన్నత పదవులలో
ఉన్న సుమారు 24 మంది భారతీయ అమెరిక న్‌లలో బన్సాల్ ఒకరయ్యారు. వీరందరిలో
యుఎస్ ఎయిడ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజీవ్ షాది అత్యున్నత
స్థానం. బన్సాల్ 2009 నుంచి 2011 వరకూ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్
కార్యాలయంలోని జనరల్ కౌన్సెల్‌లో సీనియర్ విధాన వ్యవహారాల సలహాదారుగా పని
చేశారు. ఆమె 2010 నుంచి 2011 వరకూ కౌన్సెల్ ఉపాధ్యక్ష పదవి కూడా
చేపట్టారు. ఒబామా పాలక వర్గంలో చేరడానికి ముందు ఆమె న్యూయార్క్ స్టేట్
సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. అలాగే అమెరికా సుప్రీం కోర్టు
న్యాయమూర్త్తుల్లో ఒకరైన జాన్ పాల్ స్టీవెన్స్ వద్ద లా క్ల ర్కుగా
పనిచేశారు. అంతకు ముందు ఆమె అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా
కమిషన్‌కు కమిషనర్‌గా, అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమె హార్వర్డ్ లా
స్కూల్, హార్వర్డ్ -రాడ్ క్లిఫ్ కాలేజీలలో కూడా విద్యాభ్యాసం చేశారు.