కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ డిసెంబర్ 17 న తేదీన ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా భద్రాచలం చేరుకొని అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం గాంధీపధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే శ్రీ రామాయణ జాతీయ మహాసదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించనున్నారు.