త్రిభాషా చిత్రం ‘అంతం’ చిత్రలోగోను సినీనటుడు పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించారు. ఆదివారం రాత్రి అబిడ్స్‌లోని మెర్క్యురీ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బాలీవుడ్ యాక్షన్ స్పెషలిస్ట్ టినువర్మ ఈ చిత్రానికి దర్శకుడు.
‘అంతం’ లోగో, ఆడియోలను ఆవిష్కరించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘పులి..షూటింగ్ టైంలో టినువర్మ పరిచయమై మంచి మిత్రుడయ్యారని, ఆ స్నేహంతో ఈ సినిమాలోని యాక్షన్ దృశ్యాల గురించి చెప్పారన్నారు. ఈచిత్ర కధ ఆసక్తికరంగా అనిపించింద ని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.