8, నవంబర్ 2010, సోమవారం

ఇందిరాగాంధీ, ఎన్టీరామారావు లే ఓడిపోయారు నేనెంత

అధికారం, పదవిలోనున్న లేకున్న తన ఈస్థాయిలో వుంచిన నగర ప్రజల పక్షానే వుంటూ వారికి సేవ చేయడం తన కర్తవ్యమని పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

తన రాజకీయ ఎదుగుదలకు నియోజక వర్గ ప్రజలే కారణమని తన ఏ స్థాయిలో ఉన్న నియోజక వర్గ ప్రజలను మరువనన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నా డియస్‌ గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీరామారావు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం ఓటమిపాలైన సందర్భలున్నాయని అన్నారు.

తన షష్టి పూర్తి సందర్భంగా స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లాకు మంజూరు చేసిన మెడికల్‌ కళాశాల తరగుతులు వచ్చే జూన్‌ నాటికి ప్రారంభం కావాలని ఆశభావం వ్యక్తం చేశారు.

కేంద్రం నియమించిన శ్రీ కృష్ణ కమిటి డిసెంబర్‌ 31న కేంద్రానికి నివేదిక అందిస్తుందని నివేదిక అనుసారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తదనంతర పరిణామాల్లో ఉద్యమంలో భాగస్వాములవుతారని ప్రశ్నించగా ఆయన దాటా వేశారు.