శాసనమండలికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలుపించుకోవడం కోసం ప్రధాన పార్టీల్లో ఫీవర్ మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎం.వి.శర్మ పదవీ కాలం 2011 మార్చి 29తో ముగుస్తున్నందున ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహంతో గెలుపునకు పావులను కదపడం ప్రారంభించాయి. ఈ నెల 11వ తేదీతో పట్టభద్ర ఓటర్ల నమోదు కార్యక్రమం ముగుస్తుంది.