ఆదివాసి గోండు గిరిజనుల సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుతూ వారికి అండగా నిలుస్తానని ఎప్పటికప్పుడు ప్రకటన చేసే ఓ నాయకుడు వారి సంస్కృతిని కించ పర్చిన సంఘటనతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఉట్నూరు మండలంలోని రాజుగూడాలో జరిగిన గుస్సాడి దండారి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్లమెంట్ సభ్యులు రాథోడ్ రమేష్ సాంప్రదాయాలను పట్టించుకోకుండా వారి ఆచార వ్యవహారాలను కించపర్చే విధంగా బూట్లు ధరించి తలకు నెమలిపించం టోపీ వేసుకొని గుస్సాడి నృత్యం చేయడం సహించరాని చర్య అని ఆదివాసి హక్కుల పోరాట సమితీ తుడుందెబ్బ ఆరోపించింది
ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినందుకు ఆదివాసులందరికి రాథోడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.